
రైతులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా అంటే నాకు చాలా అభిమానమని ఈ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ పర్యటనలో వైసీపీ నాయకులు అడుగడుగునా అడ్డుకోవడంతో తీవ్ర అభ్యతరం చెప్పారు. రాష్ట్రంలో పర్యటించకూడదా అని ప్రశ్నించారు. రైతులకు భరోసా కల్పించకూడదా అని అడిగారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులను హెచ్చరించ్చారు. రైతాంగాన్ని పరామర్శించేందుకు వచ్చిన నన్ను అడ్డుకోవడం సరికాదన్నారు. దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.