
కరోనా మృతులపై బంగారు ఆభరణాలను మరోసారి దొంగిలించిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. గతంలోనూ కొన్ని ఆసుపత్రుల్లో కరోనా మృతులపై ఉన్న ఉంగరాలు, తాళిబోట్లు లాగేసుకున్న ఘటనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపిఐ ఆరోగ్యశాఖ మంత్రి హెచ్చరిస్తున్నా దోపిడీ ఆగడం లేదు.పుంగనూరు పరిధిలోని చౌడేపల్లికి చెందిన వెంకటరత్నం కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో స్విమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈనెల 23న ఆయన గుండెపోటుతో మరణించారు. అయితే మృతదేహంపై ఉన్న బంగారు ఆభరణాలు లేకపోవడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఆసుపత్రి సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజీ పరిశీలించగామృతదేహన్ని ప్యాక్ చేయడానికి వచ్చిన వార్డుబాయ్ మృతుడి ఉంగరాలను తీసుకున్నట్లు రికార్డయింది. దీంతో మరోసారి బంగారు ఆభరణాలు దొంగిలించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.