
ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్, అద్దంకి వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అనుచరులు పోటాపోటీగా అద్దంకిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అద్దంకిలో కృష్ణ చైతన్య ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కరణం బలరామ్ ఫ్లెక్సీలకు అనుమతి లేదంటూ వాటిని మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో బలరామ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.