
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులు భయపడాల్సిన అవసరం లేదని పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తి భీమారావు అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితుల స్టేట్‌మెంట్‌ను జిల్లా న్యాయమూర్తి భీమారావు నమోదు చేశారు. ఫిట్స్‌తో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరినట్లు వివరించారు. లెడ్, నికెల్ కారకాలున్నట్లు ఎయిమ్స్ ప్రతినిధుల ద్వారా తెలిసిందన్నారు. ఎయిమ్స్ నివేదిక వచ్చాక కారణాలు విశ్లేషించి హైకోర్టుకు పూర్తిస్థాయిలో నివేదించనున్నట్లు వెల్లడించారు.