
విజయవాడలో దివ్య హత్య సంఘటనలో వైద్యాధికారులు క్లీయరెన్స్ ఇచ్చారు. ఈ సంఘటనలో దివ్వను నాగేంద్రబాబే హత్య చేసి ఉంటారని, దివ్య శరీరంపై బలంగా గాయాలున్నాయన్నారు. తానంతట తాను ఆత్మహత్య చేసుకునే విధంగా గాయాలు లేవని, ఇతర వ్యక్తి తనపై దాడి చేసినట్లుగానే లోతేగా గాయాలున్నాయని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. ఈ హత్య జరిగిన తరువాత నాగేంద్రబాబు తామిద్దరం ఆత్మహత్య చేసుకున్నామని, ఎవరి గొంతు వారే కోసుకున్నామని పోలీసులకు చెప్పాడు. అయితే దివ్య తల్లిదండ్రులు అతను చెప్పేదంతా అబద్ధమని వాధించడంతో పోలీసులు ఫోరెన్సిక్ ఫరీక్షను కోరారు. ఈ నివేదికను కోర్టులో దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.