https://oktelugu.com/

ఒంగోలు ఎంపీకి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులపై పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన మిత్రులు, పార్టీ నాయకుల కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ కోరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఏపీలో నిన్నటి వరకు 8 లక్షల కరోనా కేసులు […]

Written By: , Updated On : December 20, 2020 / 03:04 PM IST
Follow us on

కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులపై పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన మిత్రులు, పార్టీ నాయకుల కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ కోరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఏపీలో నిన్నటి వరకు 8 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 7 వేల మరణాలు సంభవించాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. వ్యాక్సిన్ తీసుకునే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగొద్దని సూచిస్తున్నారు.