
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పడ్డట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా 10 వేలకు తక్కువగా కేసులు నమోదవుతుండంతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గతంలో రోజుకు కనీసం 10 వేల కేసులు నమోదు కాగ వారం రోజులు కేసులు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 6927 కేసులు నమోదవడం చూస్తే అంతకుముందు కంటే వైరస్ ప్రభావం తగ్గినట్లే కనిపిస్తోంది. ఇక రాష్ట్రం మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,75,674 ఉండగా మరణాల సంఖ్య 5,708 సంఖ్యకు చేరింది. కరోనా నుంచి 6,05,090 మంది కోలుకోగా ప్రస్తుతం 64,876 మంది చికిత్స పొందుతున్నారు.