
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ సీ-50 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ ప్రయోగాలు విజయవంతం కావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. (నింగికెగిసిన పీఎస్‌ఎల్వీ సీ-50 రాకెట్) ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది.. పీఎస్‌ఎల్‌వీ సీ-50 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీబీ హరిచందన్ అభినందించారు.