
అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు ఇచ్చేందుకు వైఎస్సార్ జలకళ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ జలకళ కోసం రూ.2,340 కోట్లు ఖర్చు చేస్తోందని, 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగు నీరు అందనున్నారని తెలిపారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తిస్తారని తెలిపారు. పారదర్శకత కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి తెస్తామన్నారు. దరఖాస్తు నుంచి బోర్ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం అందుబాటులో ఉండే విధంగా రూపొందిస్తామన్నారు.