
కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందన్నారు. ఎవరితో సంప్రదించాలో వారితో చర్చించి మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు జీవితమే కుట్రలమయం అని ధ్వజమెత్తారు.