
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలను అణచివేతకు గురి చేస్తోందని, ఆ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఏం నేరం చేశారని ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనార్టీలలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ తరుణంలో వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని తెలిపారు.