
ముంబయ్ ఐఐటీ విద్యార్థులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన పాలనో సాధించిన విజయాలతో పాటు కరోనా సంక్షోభం గురించి ప్రస్తావించారు. కొత్త రాష్ట్రంలో అనేక సంక్షేమాలతో పాలన ప్రారంభించామని, వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి 17 శాతం వృద్ధి రేటు పెంచామని పేర్కొన్నారు. సులభతర వాణిజ్యాన్ని సద్వినియోగం చేసుకొని విజన్ -2020 రూపొందించామన్నారు. ఐటీ కంపెనీ కోసం ప్రపంచమంతా తిరిగానని, ఆ ప్రణాళిక ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు.