ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డిసెంబర్ 31, జనవరి 1న వేడుకలను రద్దు చేసింది. ఆ రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా కొవిడ్ కారణంగా ఈనెల 26 నుంచి అన్ని రకాల వేడుకలను రద్దు చేస్తున్నారు. వైన్స్ లు, బార్ల సమయాన్ని కుదించి విద్యాసంస్థలకూ కొన్ని సూచనలు చేయనున్నారు. న్యూఇయర్ సందర్భంగా పార్టీల పేరుతలో జనం గూమి గూడుతారని, దీంతో కరోనా మళ్లీ విజ్రుంభించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే దీపావళి పండుగలో గ్రీన్ టపాసులను కాల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా న్యూఇయర్ వేడుకలను నిషేధించడంతోనే మేలు జరుగుతుందని భావించి రద్దు నిర్ణయం తీసుకుంది.