
కరోనా వైరస్ పై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వచ్చి ఏడాదవుతున్నా ఇంతవరకు వ్యాక్సిన్ రాలేదని, ఇక ముందు కూడా రాదని అన్నారు. ఎవరిజాగ్రత్తలో వారు ఉండడమే తప్ప వ్యాక్సిన్ కోసం ఎదురుచూడద్దన్నారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ వస్తుందనుకోవడం భ్రమేనన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, శానిటైజర్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం చేస్తుందని, ఇందులో భాగంగా ప్రత్యేక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తోందని ఇటీవల ట్వట్టర్లో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో బాలకృష్ణ ఇలా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.