
రైతులను అరెస్టు చేసినందుకు నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి చలో గుంటూరు జైలు కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శనివారం సమితి నేతలను, రాజధాని ఎస్సీ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రైతులు రిమాండ్ జైలులో ఉన్న నేపథ్యంలో అటువైపు ఎవరినీ రాకుండా ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా కొందరు పోలీసులతో వాగ్వాదం దిగడంతో వారిని అరెస్టు చేశారు. మరోవైపు జైల్‌భరో కార్యక్రమానికి వెళ్లిన టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. విజయవాడలో బుద్ధా వెంకన్న, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు తదితరులను పోలీసులు అడ్డుకున్నారు.