
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు, కాలేజీల పున: ప్రారంభంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 2న పాఠశాలలు పున: ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రోజు విడిచి రోజు ఒంటిపూట మాత్రమే పాఠశాలలు తెరవనున్నారు. 9,10 తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 12 నుంచి మొదలవుతాయి. ఇక నవంబంర్ 23 నుంచి 6,7,8 తరగతులు, డిసెంబర్ 14 నుంచి 1నుంచి 5 తరగతులు ప్రారంభమవుతాయని సాన్వి తెలిపారు.