
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నా కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం పాఠశాలలను తెరిచింది. అయితే నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం ఆదర్శ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేయించారు. వీరిలో 4గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులందరినీ ఇంటికి పంపించారు. పాఠశాలలు ప్రారంభించిన మొదటిరోజే విద్యార్థులకు కరోనా రావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. దీంతో తల్లిదండ్రలు పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తారా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.