
ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేత లంకా దినకర్‌ను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రవరిస్తూ, అనుమతి లేకుండా టీవీ చర్చల్లో పాల్గొంటున్న ఆయనకు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. ఆయన ప్రవర్తన మారకపోవడంతో తాజాగా సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. గతంలో టీడీపీలో ఉన్న లంకా దినకర్ ఎన్నికల తరువాత బీజేపీలో చేరారు. పార్టీకి ఎలాంటి సమాచారం లేకుండా టీవీ చర్చల్లో పాల్గొనడపై పార్టీ అధిస్థానం సీరీయస్‌గా తీసుకుంది.