
ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలోని రాములోరి విగ్రహం ధ్వంసం ఘటన మరువకముందే విజయవాడలో మరో సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని బస్టాండ్ సమీపంలోని నర్సరీ వద్ద ఉన్న పురాతన సీతారామ మందిరంలోని సీతాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది గమనించిన ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. విషయం తెలిసిన టీడీపీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు భారీగా తరలివస్తున్నారు. అయితే ఎలుకలు లేదా గాలి ద్వారా విగ్రహం ధ్వంసం అయి ఉంటుందని సీఐ సత్యానందం తెలిపారు. దీంతో ఆయన సమాధానంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.