
ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 364 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,81, 559 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,71,116 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,383 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,100 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 50,794 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,17,08,678శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.