
ఏలూరు పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తో బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను సీఎంను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తిస్థాయి వైద్యం అందిస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని విజయవాడ తరలించామని.. గవర్నర్‌కు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వ్యాధి మూలాలను గుర్తించేందుకు ఎయిమ్స్, ఎన్‌ఐఎన్, సీసీఎంబీ, ఐఐసీటీ సంస్థల సహకారం తీసుకుంటున్నామని సీఎం చెప్పారు.