Nara Lokesh : యువగళం దారి తప్పుతోందా.. లోకేష్ కు అదే మైనస్

Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్ర దారి తప్పుతోందా? విపక్షాలకు అస్త్రంగా మారుతోందా? పార్టీలో అయోమయానికి కారణమవుతోందా? పార్టీ బలోపేతం కంటే డ్యామేజ్ అధికమా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. టీడీపీని అధికారంలోకి తేవడంతో పాటు తన నాయకత్వాన్ని మరింత పదును పెట్టుకునేందుకు వీలుగా లోకేష్ పాదయాత్రకు సిద్ధపడ్డారు. సుమారు 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్ పేరిట ఉన్న రికార్డును తిరిగిరాయాలన్న కసితో లోకేష్ ముందుకు సాగుతున్నారు. అయితే కొన్నిరకాల మైనస్ పాయింట్లు ప్రతికూలంగా మారుతున్నాయి. ప్రస్తుతం సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పాదయాత్ర కొనసాగుతోంది. సక్సెస్ చేసేందుకు టీడీపీ శ్రేణులు గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి.

మరో 20 రోజుల్లో కడపలో పాదయాత్ర పూర్తికానుంది. రాయలసీమ నుంచి కోస్తాలో లోకేష్ అడుగుపెట్టనున్నారు.  వచ్చే నెల నుంచి పవన్ కల్యాణ్ వారాహి ద్వారా గోదావరి జిల్లాల్లో తన యాత్ర ప్రారంభించబోతున్నారు. రాయలసీమలో అంచనాకు మించి లోకేష్ యాత్ర సాగినట్టు టీడీపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. జనాదరణ, అధికార పక్షం ఆటంకాలను అధిగమించి పాదయాత్ర కుదురుకున్నా.. లోకేష్ వ్యవహార శైలితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. లోకేష్ ప్రజలతో మమేకమవుతున్నారు. కానీ అధికారంలోకి వస్తే చేయబోయే మేలు గురించి చెప్పడం కంటే స్థానిక వివాదాలకు ప్రాధాన్యతనిస్తున్నారన్న టాక్ ఉంది.

విపక్ష నేతగా జగన్ సుదీర్ఘ కాలం పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఆయన్ను అధిగమించడమే లోకేష్ లక్ష్యం. కానీ జగన్ విపక్ష నేతగా, సీఎం అభ్యర్థిగా పాదయాత్ర చేయడంతో దారిపొడవునా ప్రజలకు ఎన్నోరకాల హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే చేయబోయే మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేశారు. లోకేష్ విషయంలో ఆ పరిస్థితి లేదు. ఆయన సీఎం అభ్యర్థి కారు.కేవలం తన తండ్రి సీఎం అయితే చేయబోయే పనులు మాత్రమే చెప్పగలరు. ఇలా ఇస్తున్న హామీలను ఎలా అమలుచేయగలరో మాత్రం చెప్పడం లేదు. ఇది కూడాి ఒక మైనస్ గా మారింది.

లోకేష్ పార్టీలో చంద్రబాబు తరువాతి స్థానంలో ఉన్నారు. పాదయాత్రలో భాగంగా అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా సంకేతాలు ఇవ్వటం..ఇప్పుడు తాను అభ్యర్థులను ఖరారు చేయలేదని చెప్పటం పార్టీలో చర్చకు కారణమవుతోంది. అదే సమయంలో నియోజకవర్గాల్లో వర్గాలు ఉన్న చోట కొంత మందికే లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. కర్నూలు జిల్లాలో అదే జరిగింది. ప్రస్తుతం  ప్రొద్దుటూరులో సైతం అదే రకమైన వివాదం ఎదురువచ్చింది.  ప్రస్తుతం పార్టీలో అదే  చర్చకు కారణమవుతోంది. ఇలా ఎటుచూసినా కాస్తా కన్ఫ్యూజన్ కనిపిస్తోంది.

Get notified whenever we post something new!

Continue reading

AP School Hair Cut Rules: విద్యార్థులకు సరికొత్త హెయిర్ స్టైల్స్.. అలా వస్తామంటే కుదరదు!

AP School Hair Cut Rules: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పరిస్థితుల్లో పిల్లల విషయంలో మరో నిర్ణయం ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలురుకు ఒకే తరహాలో హెయిర్ కట్ విధించాలని విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను...

Talliki Vandanam: తల్లికి వందనం: కొద్ది గంటల్లోనే.. రూ.13 వేలు.. పేరు ఉందో లేదో చూసుకోండి!

Talliki Vandanam: ఏపీలో మరో ప్రతిష్టాత్మక పధకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. రేపు లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయనుంది. తొలి విడత నిధుల విడుదల చేసే అర్హుల జాబితాను గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మరోవైపు ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. కొత్తగా...

AP Registration Services: ‘రిజిస్ట్రేషన్’ అవినీతి తగ్గిస్తే.. వైసీపీకి ప్రైవేటీకరణట!

AP Registration Services: ఏపీలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ప్రభుత్వం కొన్ని రకాల మార్పులు తేవాలని నిర్ణయించింది. ఆ వ్యవస్థలో జరుగుతున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు సరికొత్త విధానం ప్రారంభించేందుకు నిర్ణయించింది. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు చుట్టూ ఉన్న అవినీతి మరకను తొలగించేందుకు.. దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు.. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ సేవా...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version