Homeఆంధ్రప్రదేశ్‌YSRCP MLAs Resignation: రాజీనామా యోచనలో వైసీపీ ఎమ్మెల్సీలు?!

YSRCP MLAs Resignation: రాజీనామా యోచనలో వైసీపీ ఎమ్మెల్సీలు?!

YSRCP MLAs Resignation: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చాలా మంది ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేయడంతో పాటు పదవులను వదులుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. దీంతో వారు న్యాయ పోరాటం చేయడం ప్రారంభించారు. దీంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి మండలి చైర్మన్ కు ఏర్పడింది. అందుకే రాజీనామా చేసిన వారిని పిలిపించి వివరణ తీసుకుంటున్నారు మండలి చైర్మన్ మోసేన్ రాజు. నిన్ననే చైర్మన్ ను కలిసి వివరణ ఇచ్చారు జయ మంగళం వెంకటరమణ. ఈరోజు మిగతా ఎమ్మెల్సీలు సైతం చైర్మన్ ను కలిసి తమ వివరణ ఇచ్చారు. తప్పకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మండలి చైర్మన్ కు ఏర్పడింది.

ఆమోదానికి నోచుకోని రాజీనామాలు..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. ఓ నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు ఏడుగురు వరకు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యుల రాజీనామాకు ఆమోదం లభించడం.. వారి స్థానంలో కొత్త వారి ఎన్నిక కూడా పూర్తయింది. కానీ ఎమ్మెల్సీల విషయంలో మాత్రం రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. ఎందుకంటే శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఈ ఐదుగురి రాజీనామాను ఆమోదిస్తే ఈ పదవులన్నీ కూటమి ఖాతాలో చేరుతాయి. మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం కూడా పడిపోతుంది. దాదాపు ఏడాదిన్నరకు పైగా తొక్కి పెట్టారు రాజీనామాలను మండల చైర్మన్. కానీ ఇప్పుడు కోర్టు ఆదేశాలతో వారి వివరణ తీసుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి మండలి చైర్మన్ ది.

Also Read: కూటమి బ్రహ్మాస్త్రం.. వైసీపీ తప్పించుకోలేదా?!

బలం తారుమారు..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 మంది వరకు ఎమ్మెల్సీల బలం ఉంది. కూటమికి శాసనమండలిలో పదిమంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ఈ ఆరుగురు రాజీనామాను ఆమోదిస్తే కూటమి ఖాతాల్లో చేరనున్నాయి. 20 పైగా బలం పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రాజీనామాలు ఆమోదించిన మరుక్షణం మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఎక్కువమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఆ ఆరుగురు రాజీనామాల విషయంలో ఆమోదం లభించిన మరుక్షణం.. చాలామంది వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. 2028 వరకు మోసేన్ రాజు పదవీకాలం ఉంది. అందుకే వీలైనంత త్వరగా శాసనమండలిని హస్త గతం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కూటమి చైర్మన్ వారి రాజీనామాలను ఆమోదించిన మరుక్షణం.. మరి కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular