Homeఆంధ్రప్రదేశ్‌YSRCP MLA Reveals Sensational News : టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి.. సంచలనాలు...

YSRCP MLA Reveals Sensational News : టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి.. సంచలనాలు బయటపెట్టిన వైసిపి మాజీ ఎమ్మెల్యే!

YSRCP MLA Reveals Sensational News : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నాయకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. దూకుడు కలిగిన నేతలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అనవసరంగా దూషించి.. వ్యక్తిగత ప్రతిష్టను మంటగలిపిన నేతలను వెంటాడుతోంది కూటమి. అయితే ఆ పార్టీ సీనియర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులుగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి నేతలు. వారి విషయంలో కూటమి ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. కానీ కీలక పదవులు అంటూ వెలగబెట్టకపోయినా.. తమ నోటి దూకుడుతో లేనిపోని కష్టాలు తెచ్చుకున్న వారు ఉన్నారు. అటువంటి వారిలో వల్లభనేని వంశీ మోహన్, పోసాని కృష్ణ మురళి, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే తనలో ఉన్న ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

* చురుగ్గా విచారణ..
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం( TDP central office) మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభం అయింది. అయితే ఈ కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 127 వ నిందితుడిగా చూపారు పోలీసులు. అయితే ఆయన ఇటీవల విచారణకు హాజరయ్యారు. అయితే నాడు టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి తప్పు అని విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తనకు ఈ ఘటనతో అసలు సంబంధం లేదని.. కేవలం వారు నిరసన తెలిపేందుకు వెళ్తామని చెప్పారని.. నాటి సంగతులను విచారణ అధికారుల ఎదుట బయటపెట్టినట్లు సమాచారం. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం ఆయన ఇటువంటి చర్యలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది.

Also Read : జగన్ తర్వాత ఆయనే.. ఫుల్ క్లారిటీ!

* టిడిపిని ఇరుకున పెట్టిన నేత
2014 నుంచి 2019 మధ్య మంగళగిరి నియోజకవర్గానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉండేవారు ఆళ్ల రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy) . జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయత కలిగిన నేతగా కూడా గుర్తింపు పొందారు. అప్పటి టిడిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా నిత్యం న్యాయస్థానాలను ఆశ్రయించేవారు. ఒక విధంగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే గత ఐదేళ్లలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మిగతా నేతల మాదిరిగా రాజకీయ ప్రత్యర్థులను దూషించలేదు. పురుష పదజాలాలు వాడలేదు. కానీ ఇప్పుడు టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి ఆయన మెడకు చుట్టుకుంటోంది. అది అసలు తనకు సంబంధం లేని విషయమని.. నాడు వద్దని వారించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి.

* కాంగ్రెస్ పార్టీలో చేరినట్టే చేరి..
2024 ఎన్నికల్లో మంగళగిరి( Mangalagiri) నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అక్కడ కొద్ది రోజులు కూడా ఉండలేకపోయారు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఏ నియోజకవర్గ బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించలేదు. దీంతో తీవ్ర ఆవేదనతో ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి తన మనసులో ఉన్న విషయాలను విచారణ అధికారుల ఎదుట బయట పెట్టినట్లు సమాచారం. మరి ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version