YSRCP Leadership Clash: ఇష్టం లేని రాజకీయాలు ఎవరూ చేయలేరు. తమకు నచ్చిన చోట మాత్రమే రాజకీయాలు చేయగలరు. ఈ విషయంలో సరిగ్గా అంచనా వేయలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ నాయకత్వం. మొన్నటి ఎన్నికల్లో 80 చోట్ల అభ్యర్థులను మార్చింది. ఒక నియోజకవర్గ నుంచి మరో నియోజకవర్గాని కి నేతలను పంపించింది. కేవలం వ్యతిరేకతను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కానీ అది మొదటికే మోసం తెచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయాన్ని మిగిల్చింది.. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అదే వైఖరి అనుసరిస్తున్నారు. నియోజకవర్గాల మార్పు ఫార్ములాను సైతం కొనసాగిస్తున్నారు. అందులో ఇద్దరు మాజీ మంత్రులను బలవంతంగా తమ స్థానాలకు కాదని వేరే చోటికి పంపిస్తున్నారు. అయితే అందుకు ఆ మాజీ మంత్రులు నో చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీలోనే కొనసాగుతాం కానీ.. ఆ నియోజకవర్గాలకు వెళ్ళేది లేదని తేల్చి చెబుతున్నారు.
Also Read: మళ్లీ వారం వారం కోర్టుకు జగన్?!
రజినీకి స్థాన చలనం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదృష్టం ఎవరిది అంటే మాజీమంత్రి విడదల రజినిది( vedala Rajini ). 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే ఎంతోమంది నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారందరినీ కాదని రజని ఆ టికెట్ దక్కించుకున్నారు. తొలి ప్రయత్నం లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొద్ది కాలానికి మంత్రి అయ్యారు. అయితే కేవలం టిడిపి కార్యకర్తగా ఉన్న ఆమె ఏకంగా మంత్రి అయిపోయారు. అయితే ఐదేళ్ల కాలంలో చిలకలూరిపేటలో ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. దీంతో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పంపించారు. అయితే అక్కడ ఆమె దారుణ పరాజయం చవిచూశారు. ఇప్పుడు వెనక్కి వచ్చేసారు. చిలకలూరిపేట బాధ్యతలను చూస్తున్నారు. కానీ రేపల్లెలో వైసిపి ఇన్చార్జిగా సరైన వ్యక్తిని నియమించాలని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి రజినీని అక్కడకు వెళ్లాలని సూచిస్తున్నారు. అందుకు ఆమె ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.
Also Read: వైయస్ షర్మిల కు పెద్ద కష్టం!
అనిల్ కు నో ఛాన్స్..
జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ప్రోత్సాహం అందించిన నేతలు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) ఒకరు. నెల్లూరు సిటీ నియోజకవర్గ నుంచి 2014 ఎన్నికల్లో గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. 2019 ఎన్నికల్లో రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకే అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచేసరికి జగన్మోహన్ రెడ్డి పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. కీలకమైన పోర్టు పోలియోను కేటాయించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయనపై వ్యతిరేకత ఉందని చెప్పి నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి పంపించారు. అక్కడ ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్. ఓటమి తర్వాత కనిపించకుండా మానేశారు. నెల్లూరు సిటీ బాధ్యతలను వేరే నేతకు అప్పగించారు జగన్. అయితే తనకు నెల్లూరు కావాలని అడిగారు అనిల్ కుమార్ యాదవ్. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చిలకలూరిపేట వెళ్లాలని సూచించారు. అందుకు ఎంత మాత్రం అంగీకరించడం లేదు అనిల్ కుమార్ యాదవ్. చిలకలూరిపేట నుంచి కదిలేందుకు రజిని ఇష్టపడడం లేదు. బాధ్యతలు తీసుకునేందుకు అనిల్ ఆసక్తి చూపడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వైసిపికి ఇది ఇబ్బందికరమే. అయితే ఆ ఇద్దరు నేతలు తాము వైసీపీలోనే కొనసాగుతాం కానీ ఆ బాధ్యతలు మాత్రం చూడమని తేల్చి చెబుతున్నారు. అయితే లోగుట్టు ఏంటంటే వీరు ప్రత్యామ్నాయంగా వేరే పార్టీలో చేరేందుకు సిద్ధపడినా.. తీసుకునేందుకు మాత్రం ఏ రాజకీయ పార్టీ ఆసక్తిగా లేదు.