Tammineni Sitaram silent mode: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా యాక్టివ్ గా పాల్గొనడం లేదు. ప్రస్తుతం ఆయన ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ కాదు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం వైసిపి ఇన్చార్జిగా ఉన్నారు. మొన్న మధ్యన గట్టిగానే సౌండ్ చేశారు. కానీ ఇటీవల మాత్రం సైలెంట్ అయ్యారు. ఈ సైలెన్స్ వెనుక అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంపై జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా తేల్చేసినట్లు ప్రచారం నడుస్తోంది. తప్పనిసరిగా తన ఆదేశాలను పాటించాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అప్పటినుంచి ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు తమ్మినేని. రాజకీయంగా ఆయనకు ఏం చేయాలో కూడా ఇప్పుడు పాలు పోవడం లేదు.
తప్పని ఓటమి..
స్పీకర్ గా ఐదేళ్లపాటు కొనసాగారు తమ్మినేని సీతారాం. మొన్నటి ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. ఆయనపై స్వయానా మేనల్లుడు కూన రవికుమార్ గెలిచారు. అయితే ఆమదాలవలసలు కుటుంబ రాజకీయంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తమ్మినేని సీతారాం ను పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ద్వితీయ శ్రేణి నాయకుడు చింతాడ రవికుమార్ కు అప్పగించారు బాధ్యతలు. అయితే ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు తమ్మినేని. జగన్మోహన్ రెడ్డి మాత్రం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు తమ్మినేనికి కట్టబెట్టారు. ఆమదాలవలస అసెంబ్లీ నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలి అనేది తమ్మినేని ఆలోచన. కనీసం తన కుమారుడిని ఇన్చార్జిగా నియమించి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వినిపించారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆమదాలవలస పై ఆశలు వదులుకోండి.. శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయండి అంటూ తమ్మినేనికి సూచించారు. అయితే అధినేత మనసు మారుతుందని.. తనకే ఛాన్స్ దక్కుతుందని తమ్మినేని భావించారు. అయితే రోజురోజుకు ఆమదాలవలస నియోజకవర్గంలో చింతాడ రవికుమార్ స్ట్రాంగ్ అవుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని మరోసారి సంప్రదిస్తే తమ్మినేని సీతారాంకు పెద్ద రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది.
అధినేత ఆదేశాలతో..
ఇటీవల తమ్మినేని సీతారాం ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఆయన తన కుమారుడిని తీసుకొని జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. కుమారుడి కోసం ఆమదాలవలస నియోజకవర్గాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఖరాఖండిగా తేల్చేశారట. చేస్తే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి చెయ్యండి. లేకుంటే గౌరవంగా తప్పించుకోవచ్చు. కీలక నిర్ణయం తీసుకోవచ్చని సెలవు ఇచ్చారట. అప్పటినుంచి ఏం చేయాలో తెలియక ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు తమ్మినేని. మున్ముందు తమ్మినేని సీతారాం నిర్ణయాలు ఎలా ఉండబోతాయో చూడాలి
