Ysrcp Leaders: ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతోంది. దీంతో సొంత పార్టీలోనే దొంగలున్నారు. ఈ నేపథ్యంలో బడా నేతల చేత చోటా నేతలు బాధలు అనుభవిస్తున్నారు. వారు పెట్టే వేధింపులు భరించలేక ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. కంచే చేను మేసిన చందంగా సొంత పార్టీ నేతలే ఇబ్బందులకు గురిచేస్తుంటే చిన్న నాయకులు భరించలేకపోతున్నారు. ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తున్నారు. దీనిపై వైసీపీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వారి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ర్టంలో ఇసుక కూడా దొరకడం లేదు. దీంతో ఇళ్లు కట్టుకునే వారికి తిప్పడం లేదు. ఇసుక ఆన్ లైన్ లో బుక్ చేసుకుందామంటే సర్వర్ పని చేయడం లేదు. ఇల్లు నిర్మాణ పనులు నిలిచిపోయి ఆందోళన చెందుతున్నారు. దీనికి ఓ వైసీపీ నేత విసిగిపోయి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. బలసమారులో వైసీపీ నేత ఎల్లా పరమేశ్వర్ రెడ్డి ఇసుక దొరకడం లేదని నిరసిస్తూ సెల్ టవర్ ఎక్కి దూకుతానని బెదిరించాడు. దీంతో అతడి ప్రాణాలు ఎక్కడ పోతాయోనని అందరు ఆందోళన చెందారు.
రాష్ట్రంలో ఎన్నికైన సర్పంచ్ లు, ఎంపీటీసీలకు నిధులు లేకుండా పోయాయి. దీంతో అభివృద్ధి పనులు అటకెక్కిపోతున్నాయి. సర్పంచ్ లకు విడుదల చేసిన నిధులు కూడా సర్కారు లాగేసుకోవడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదు. గ్రామాల్లో ఏ పనులు కూడా ముందుకు సాగడం లేదు. ఓట్లు వేయించుకుని గెలిచిన పాపానికి ఏ పని చేయకపోతే తల ఎక్కడ పెట్టుకోవాలని నిత్యం ఆందోళనకు గురవుతున్నారు.

అందుకే ప్రభుత్వంపై అక్కసు పెంచుకుంటున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. దీంతో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. వారి నిధులు కూడా లాగేసుకోవడంతో ఇక ఏం పనులు చేయాలని దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వంపై సహజంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటనతోనైనా వైసీపీ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.