Tirumala Laddu Controversy: రాజకీయాలు ఎప్పుడు సెంటిమెంట్ చుట్టూ నడుస్తాయి. ప్రజల్లో ఉండే భావోద్వేగాలు రాజకీయాలపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు ఏపీలో అదే జరగబోతోంది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ప్రజలు తిరస్కరించారు. అయితే ఇప్పటికీ అదే వ్యతిరేకత ఉండేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. నిత్యం వైసిపి వైఫల్యం పై చర్చ జరిగేలా చూస్తోంది. అందులో భాగంగా కూటమికి గొప్ప బ్రహ్మాస్త్రం దొరికింది. శాసనసభలో నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చ జరిగింది. జీరో అవర్ సమయాన్ని రద్దు చేసి మరి నెయ్యి కల్తీ అంశం పైనే చర్చించింది కూటమి ప్రభుత్వం.
Also Read: లోకేష్ తలచుకుంటే అంతే!
* భక్తుల్లో అదే ఆగ్రహం..
సాధారణంగా తిరుమల అంటేనే కోట్లాదిమంది భక్తుల మనోభావంతో ముడి పడే అంశం. ఎప్పుడైతే నెయ్యి కల్తీ జరిగి.. అదే నెయ్యితో లడ్డూలను తయారు చేశారు అని తెలిసిన మరుక్షణం భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజాగ్రహం కనిపించింది. అయితే దానిని తగ్గించుకునేందుకు రాజకీయ కోణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూపించింది. కానీ అది వర్కౌట్ కాలేదు. మధ్య మధ్యలో హెరిటేజ్ వంటి అంశాలను తెరపైకి తెచ్చారు. కానీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి ఆధారాలను బయటపెట్టేసారు. పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి.. నెయ్యి కల్తీ అనేది నేరం కాదని.. మహా అపరాధం అని.. తప్పు చేస్తే తరాలు సైతం లేచిపోతాయి అంటూ గట్టి హెచ్చరికలు పంపారు.
* వచ్చే ఎన్నికల వరకు..
కూటమి ప్రభుత్వం ఆలోచన చూస్తుంటే మాత్రం.. జాతీయ స్థాయిలో సైతం ఈ అంశాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. మరోవైపు హిందువుల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక రకమైన అనుమానాలు ఉన్నాయి. వాటిని మరింత హైలెట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కచ్చితంగా అదే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు దీనిని రాజకీయంగా మార్చి.. కూటమిని టార్గెట్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ నిన్న శాసనసభలో జరిగిన చర్చ చూస్తుంటే మాత్రం.. కూటమి ప్రభుత్వం ఆధారాలతో బయటపెట్టిన క్రమం.. ఈ పరిస్థితులన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మున్ముందు కష్టాలు తెచ్చి పెట్టేవి. ముఖ్యంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో కూడిన అంశం కావడం.. కూటమి పట్టు బిగిస్తుండడం.. చూస్తుంటే మాత్రం హిందూ సమాజం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే అవకాశం లేదు అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..