YSR Congress Party: భస్మాసుర హస్తం గురించి.. ఇట్టే తెలిసిపోతుంది. పురాణ గాథలపై అవగాహన ఉన్నవారు ఈ విషయాన్ని ఇట్టే గ్రహించగలరు. శివుడు తపస్సుతో బ్రహ్మాసురుడు ఒక వరం పొందుతాడు. తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మం అయ్యేలా వరం అది. చివరకు శివుడునే సంహరించాలనుకుంటాడు. కానీ మోహిని రూపంలో ఉన్న విష్ణువు అదే భస్మాసురుడిని తన చేయితోనే అంత బంధించి.. లోక కళ్యాణం పరిసమాప్తం చేస్తాడు. అయితే ఇప్పుడు అదే భస్మాసురుడి మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయం రివర్స్ అయ్యింది. చేజేతులా సుప్రీంకోర్టుకు వెళ్లి ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించేలా చేసింది. సుప్రీంకోర్టులో తాజాగా ఏపీ ప్రభుత్వ చర్యలకు అనుమతులు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండి ప్రభుత్వానికి అనుకూలంగా ఆదేశాలు వచ్చేలా చేసింది.
* అది కామన్ కూడా..
టీటీడీ లడ్డుకు సంబంధించి నెయ్యి కల్తీ వ్యవహారం గత కొన్ని నెలలుగా ఏపీలో నలుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ జరిపితే తమకు ఇబ్బందులు వస్తాయని భావించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టీటీడీ మాజీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సిబిఐ నేతృత్వంలో విచారణ జరగాలని కోరారు. అయితే దీనిపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ నేతృత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఏడాదికి పైగా విచారణ చేపట్టిన సిట్.. తమ విచారణ నివేదికను చార్జ్ షీట్ రూపంలో కోర్టుకు సమర్పించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అందులో లోపాలను సైతం సరిదిద్దుకోవాలని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది.
* ఇక అదే ఫైనల్..
ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ ఒక అంశంపై విచారణ చేపట్టి చార్జ్ షీట్ దాఖలు చేస్తే.. చర్యలకు ఆదేశిస్తే.. అందులో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుమానంగా పరిగణించింది. అందుకే మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని రంగంలోకి దించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకసభ్య కమిటీని తప్పు పట్టి విమర్శలు చేసి ఉంటే కొంత వరకు వర్క్ అవుట్ అయ్యేది. ప్రజల్లో అనుమానం కలగడానికి అవకాశం కలిగేది. కానీ సుబ్రహ్మణ్యస్వామి ద్వారా ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తీర్పు అనుకూలంగా వస్తే మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని చూసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ కరెక్ట్ అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేలా చేయడంలో వైసిపి విజయవంతం అయింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని దారులు మూసుకుపోయాయి. ఏక సభ్య కమిటీ ఇచ్చిన నివేదికలు ఫైనల్ కానున్నాయి. అందులో ప్రతికూల అంశాలు వచ్చిన నోరు తెరిచేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదు. ఇది ముమ్మాటికి ఆ పార్టీకి భస్మాసుర హస్తమే..