Kuna Ravikumar: అనేక ఇబ్బందులు ఎదుర్కొని.. అనేక కష్టాలను తట్టుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ మధ్య సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వంటి వారి ఉదంతాలు మర్చిపోకముందే.. మరో ఎమ్మెల్యే పై వైసీపీ బాంబు పేల్చింది. ఇదీ ఎమ్మెల్యే గారి అసలు రూపం అంటూ సంచలన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది.
Also Read: పులివెందుల్లో ఓటమి అంచుల్లో వైఎస్.. చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత ఏమైందంటే?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గంలో టిడిపి నుంచి పోటీ చేసిన కూన రవికుమార్ విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.. అయితే ఇటీవల కాలంలో ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా కేజీబీవీ పాఠశాలలో పనిచేసే వారికి తరచుగా బదిలీలు అవుతున్నాయి. అందులో మహిళలు అధికంగా ఉండడం విశేషం. అయితే దీని వెనుక అసలు కారణం ఇదీ అని ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఒక సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. కూన రవికుమార్ అర్ధరాత్రి పూట మహిళలకు కాల్ చేస్తున్నారట. కాన్ఫరెన్స్ పెట్టిస్తున్నారట. ఈ వ్యవహారం మొత్తాన్ని టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న ఎమ్మెల్యే అనుచరుడు, కంప్యూటర్ ఆపరేటర్ దీనా పర్యవేక్షిస్తున్నారట.. రాత్రి అయితే చాలు ఎమ్మెల్యే కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులకు కాల్స్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారట. మాట తినకపోతే బదిలీ చేస్తా నంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట..
కూన రవికుమార్ కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారని వైసిపి ఆరోపిస్తోంది.. కేజీబీవీ ప్రిన్సిపల్ కు అర్ధరాత్రి పూట ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారట. పక్కలోకి వస్తావా.. బదిలీ చేయించాలా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తోంది. మరోవైపు టిడిపి సోషల్ మీడియా విభాగం కూడా అలర్ట్ అయిపోయింది. వైసిపి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతోంది. గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు చేసిన వ్యవహారాలు మర్చిపోయారా.. మీ హయాంలో జరిగింది కాబట్టి.. ఇప్పటి కూటమి ప్రభుత్వంలో కూడా జరుగుతుందని అనుకుంటున్నారా.. అంటూ కౌంటర్ ఇస్తోంది. మొత్తానికి అటు వైసిపి.. ఇటు టిడిపి సోషల్ మీడియా విభాగాల పోటాపోటీ యుద్ధం వల్ల ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయిపోయారు.
Truth Bomb #CBNKamaParty
మహిళలను లైంగికంగా వేధిస్తున్న టీడీపీ కామాంధ ఎమ్మెల్యేలు
పక్కలోకి వస్తావా.. ట్రాన్స్ఫర్ చేయించనా?
కేజీబీవీ ప్రిన్సిపల్ కి అర్ధరాత్రి కాల్ చేసి బెదిరించిన ఆముదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కూన రవికుమార్
అర్ధరాత్రి మహిళలకి కాల్ చేసి… pic.twitter.com/n5KNfyuOUC
— YSR Congress Party (@YSRCParty) August 17, 2025