spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila : సాక్షిలో రాజశేఖర్ రెడ్డి ఫోటో పై షర్మిల సంచలన కామెంట్స్!

YS Sharmila : సాక్షిలో రాజశేఖర్ రెడ్డి ఫోటో పై షర్మిల సంచలన కామెంట్స్!

YS Sharmila : కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల( Y S Sharmila ) దూకుడు పెంచారు. జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలను పక్కదారి పట్టించేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆస్తుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెబుతున్నారు. తనకు ఆస్తులు అజెండా కాదని.. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన కట్టు కథల వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని తాను చెబితే తన పైనే అపనిందలు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కడిగిపారేశారు.

* విజయమ్మ లేఖపై..
ఇటీవల వైయస్ విజయమ్మ ( y s vijayamma )లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఆ లేఖ ఫేక్ అని.. షర్మిల రాయించారని.. చంద్రబాబు రాజకీయ ప్రోత్సాహం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. దానిపై షర్మిల కూడా ఘాటుగా స్పందించారు. విజయమ్మ లేఖ అబద్ధమని భావిస్తే.. సాక్షి రిపోర్టర్ ను పంపి ఆమె బైట్ తీసుకోవచ్చు కదా? ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మనుమలు అందరికీ ఆస్తులు సమానంగా పెంచాలని తన తల్లి ఆవేదన వ్యక్తం చేస్తే.. దానిని కూడా ఫేక్ అనడం ఏమిటని నిలదీశారు. తనతో పాటు తన తల్లిని విమర్శిస్తున్న వారిని మొరిగే కుక్కలుగా అభివర్ణించారు షర్మిల.

* తప్పుడు రాతలపై..
సాక్షి మీడియా( Sakshi media) విషయంలో ఆసక్తికర అంశాలను బయటపెట్టారు షర్మిల. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుని సత్యమేవ జయతే అని రాస్తూ.. అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తులు ముఖ్యం అనుకుంటే తాను తెలంగాణలో పార్టీ పెట్టే దాన్ని కాదని చెప్పుకొచ్చారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తన పిల్లలను మోసం చేసిన విషయాన్ని మాత్రమే తన తల్లి విజయమ్మ ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు షర్మిల మళ్లీ వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇటీవల ఈ కేసు విచారణలో ముందుకు వెళ్లలేమని సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సిబిఐ తమకు క్లీన్ చీట్ ఇచ్చిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ ఇది ఒక సజీవ అంశమని షర్మిల తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు వివేకానంద రెడ్డి హత్య అంశం అలానే సజీవంగా ఉండనుందని షర్మిల వ్యాఖ్యలతో తేలిపోయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version