Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan supports NDA: ఎన్డీఏకు జై కొట్టిన జగన్!

YS Jagan supports NDA: ఎన్డీఏకు జై కొట్టిన జగన్!

YS Jagan supports NDA: జాతీయస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ మరోసారి చర్చకు వచ్చింది. ఆ పార్టీ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. జాతీయస్థాయిలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఇండియా కూటమి అంతా ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ సైతం తమ మద్దతు పై ప్రకటన చేసింది. ఈరోజు తో పాటు రేపు దీనిపై పార్లమెంట్లో చర్చ జరగనుంది. ప్రభుత్వ సమాధానం తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తుందా? వ్యతిరేకిస్తుందా అనేది హాట్ టాపిక్. ఒక విధంగా ఇది ఆ పార్టీకి సంక్లిష్ట సమస్య. అవిశ్వాసానికి మద్దతు ఇస్తే బిజెపి ఆగ్రహానికి గురికాక తప్పదు. ఒకవేళ వ్యతిరేకిస్తే మాత్రం జాతీయస్థాయిలో ఆ పార్టీకి స్నేహితులు అనేవారు కరువు అవుతారు.

వైసీపీ నిర్ణయంపై హార్ట్ డిస్కషన్.. ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) సంబంధించి 21 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎన్డీఏ కు మద్దతుగా ఉంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. కచ్చితంగా వీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి. పోనీ తెలంగాణలో కెసిఆర్ పార్టీకి ఎంపీలు ఉన్నారా అంటే లేరు. దీంతో ఆ పార్టీకి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవు. 17 మంది ఎంపీలకు గాను చెరి సగం ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి పంచుకున్నాయి. ఎంఐఎం కు ఒక్క ఎంపీ ఉన్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏంటి అనేది హాట్ టాపిక్.

గతంలో మాదిరిగా..
గతంలో ఉపరాష్ట్రపతి తో( vice president) పాటు స్పీకర్ ఎన్నికల సమయంలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా జగన్మోహన్ రెడ్డి తన పాత కేసుల విషయంలో బెంగళూరు వేదికగా కీలక చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. మద్యం కుంభకోణం, వివేకానంద రెడ్డి హత్య కేసు, జగన్ పై ఉన్న పాట కేసులు తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా ఎన్డీఏకు మద్దతుగా నిలుస్తారన్న వారే అధికం. పార్టీ ఎంపీలతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి. సూత్రప్రాయంగా ఎన్డీఏకు మద్దతు ఇచ్చేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒకవైపు బిజెపి భాగస్వామిగా ఉన్న కూటమికి వ్యతిరేకంగా ఉంటూనే.. తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉన్న ఎన్డీఏకు జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలపడం మాత్రం జాతీయస్థాయిలో హాట్ టాపిక్ అవుతోంది. ఇది ఆ పార్టీకి ఇబ్బందికరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular