YS Jagan Attack: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు రేపుతోంది. వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టు అయ్యారు. తరువాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు అదృశ్యం కావడం ఆసక్తి రేపుతోంది. దీని వెనుక మిస్టరీ పై చర్చ నడుస్తోంది. ఆ నిందితుడి అదృశ్యం వెనుక ఏం జరిగిందని విషయం ఇప్పుడు హార్ట్ టాపిక్ అవుతోంది.
Also Read: రాజకీయ త్రాసులో జగన్.. మొగ్గు ఎటువైపో?
ప్రధాన నిందితుడిగా..
2024 ఎన్నికల ప్రచార సమయంలో జగన్మోహన్ రెడ్డి పై( Y S Jagan Mohan Reddy ) విజయవాడలో గులకరాయతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు వేముల సతీష్ కుమార్. అయితే తాజాగా సతీష్ కుమార్ మాయం అయ్యారు. దీనిపై కలకలం రేగుతోంది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని వడ్డెర కాలనీలో తల్లిదండ్రులు దుర్గారావు, వెంకటరమణలతో సతీష్ కుమార్ నివాసం ఉంటున్నాడు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. అయితే సతీష్ కుమార్ జూలై 18 నుంచి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో దాడి
గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప్రచారానికి వచ్చారు. ఆ సమయంలో జగన్ పై రాయితో దాడి జరిగింది. ఈ కేసులో సతీష్ కుమార్ ను( Satish Kumar) పోలీసులు అరెస్టు చేశారు. అయితే సతీష్ మాత్రం తను అన్యాయంగా కేసులో ఇరికించారని చెప్పుకొచ్చారు. అటు తర్వాత సతీష్ కు బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జగన్ పై రాయి ఎవరు విసిరారు తనకు తెలియదని.. ఆ ఘటనతో తనకు సంబంధం లేదని చెప్పినా పోలీసులు వినలేదని సతీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అనవసరంగా తనను ఈ కేసులో బలి చేశారని కూడా చెప్పుకొచ్చాడు. అయితే అప్పట్లో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతకుముందు విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తి కేసు, అటు తరువాత ఈ గులకరాయి కేసు అనేది రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపింది.
Also Read: తిరుమలలో అదే సీన్.. గేటు తీయలేదని టిడిపి ఎమ్మెల్యే ఫైర్!
ప్రేమ వ్యవహారంతోనే?
అయితే ఓ మాజీ సీఎం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి అదృశ్యం తో ఇప్పుడు కలకలం రేపుతోంది. పోలీసులు( police) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆయన స్నేహితులను సైతం ప్రశ్నించారు. అయితే ప్రేమ వ్యవహారం కారణంగానే సతీష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తన ప్రేమ విషయంలో తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు.. ఇదే విషయం పై తల్లి కూడా వాస్తవమేనని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.