YS Jagan Sharmila: సమాజాన్ని చక్కగా వారు.. సొంతింటిని చక్కదిద్దలేరు. ఇది చాలా సందర్భాల్లో మనకు కనిపించేదే. అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy). నిన్న లోకమంతా రక్షాబంధన్ వేడుకల్లో గడిపింది. కానీ జగన్ ఇంట్లో మాత్రం ఆ వేడుకలు కనిపించలేదు. తోబుట్టువు ఉన్న రాఖీ కట్టేందుకు రాలేదు. అంతలా వారి మధ్య గ్యాప్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సోదరుడు జగన్ పట్ల షర్మిలకు ఒక రకమైన ద్వేష భావన ఉంది. దానికి కారణాలు లేకపోలేదు. తన అన్న ఉన్నతికి కృషి చేస్తే.. అందుకు తగ్గ గుర్తింపు ఇవ్వలేదన్న బాధ షర్మిలది. అందుకే వారి మధ్య గ్యాప్ పెరిగింది. పూడ్చలేని అగాధం ఏర్పడింది.
Also Read: తండ్రి ఆస్తులన్నీ నాకేనంటున్న షర్మిల.. తనవేనంటున్న జగన్.. పరిష్కారం ఎలా?
ముఖం చాటేసిన షర్మిల..
రక్షాబంధన్ ( Rakshabandhan )అంటే సోదర ప్రేమకు ప్రతీక. ఎన్నో రకాల అభిప్రాయ భేదాలు ఉన్నా.. తోబుట్టువుల మధ్య రక్షాబంధన్ వాటన్నింటినీ అధిగమించేలా చేస్తుంది. అందర్నీ ఐక్యం చేస్తుంది. అటువంటి రక్షాబంధన్ నాడు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖం చూసేందుకు కూడా షర్మిల ఇష్టపడలేదు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డితో వేదిక పంచుకునేందుకు కూడా ఆమె ముందుకు రావడం లేదు. చివరకు తండ్రి జయంతి, వర్ధంతి నాడు ఆయన స్మారక మందిరం వద్ద కలుసుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు. అంతలా పెరిగిపోయింది వారి మధ్య గ్యాప్. వ్యక్తిగత, కుటుంబ, రాజకీయ వైరం కాస్త ద్వేషానికి దారితీసింది.
Also Read: వైఎస్ షర్మిలతో జగన్ లాలూచీ నిజమా? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది?
ఆకట్టుకుంటున్న పోస్ట్..
ఓ మాజీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న తన తోబుట్టువులు అంటూ సంబోధిస్తూ వారికి అభినందనలు తెలిపారు. కానీ తన ఇంట్లో ఉన్న తోబుట్టు మాత్రం తన వైపు చూడలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారం నడిచింది దీనిపై. ఈ తరుణంలో ఓ చిన్న బాలుడు.. తన స్నేహితులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. నాకు ఆ అవకాశం లేదని.. మీరంతా ఘనంగా జరుపుకోవాలని ఆ బాలుడు వీడియోలో చెప్పిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పడం.. ఇంకోవైపు షర్మిల జగన్మోహన్ రెడ్డి చేతికి రాఖీ కట్టిన ఫోటో జతచేస్తూ.. ఆ బాలుడి వీడియోతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లకు విపరీతంగా ఆకట్టుకుంటోంది.