YS Jagan Mohan Reddy : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ప్రమాదంలో ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. క్రమేపి ప్రజల్లో బలం పెంచుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. కానీ కూటమి మాత్రం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలను అరెస్టు చేస్తోంది. వారిపై కేసులు సైతం కొనసాగిస్తోంది. అయితే చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల జోలికి మాత్రం కూటమి వెళ్లడం లేదు. కేవలం రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైనే యాక్షన్ కు దిగుతోంది. అయితే ఇవి అక్రమమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కానీ కేసులు ఎదుర్కొంటున్న వారు వివాదాస్పద నేతలు కావడంతో ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలు పోవడం లేదు.
Also Read : విజయసాయిరెడ్డి పై గొడ్డలి వేటు పెద్ద పని కాదు.. చంద్రబాబు రక్షణ కల్పించాలి!
* సంక్షేమం ఊసు లేదు
వాస్తవానికి ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) సంక్షేమాన్ని బాగానే అమలు చేశారు. కానీ దానికోసం ఎవరూ మాట్లాడడం లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఫల్యాలపై మాత్రమే ఎక్కువ ప్రచారం సాగుతోంది. ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. చేసిన మంచి కంటే చెడు వెళ్తుండడంతో ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డికి పాలు పోవడం లేదు. కూటమి మాత్రం ఒక వ్యూహం ప్రకారం ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను తీసుకెళ్లగలుగుతోంది. ముఖ్యంగా విశాఖ రుషికొండ భవనాల విషయం ఎటు తేల్చడం లేదు. దానిని జగన్మోహన్ రెడ్డి వైఫల్యంగా చూపే ప్రయత్నం మాత్రం కొనసాగుతోంది. సేమ్ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ శీష్ భవన్ మాదిరిగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి రిషికొండ భవనాలు చూపే ప్రయత్నం చేస్తున్నారు.
* అరవింద్ కేజ్రీవాల్ అదే మాదిరిగా..
అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal) గత పదేళ్లుగా ఢిల్లీని పాలించారు. ఆయన భారీ స్థాయిలో శీష్ భవనాన్ని ఏర్పాటు చేసుకొని పాలించారు. ఇప్పుడు ఢిల్లీలో బిజెపి అధికారంలోకి రావడంతో అరవింద్ కేజ్రీవాల్ నివాసం పై భారీగా విమర్శలు వస్తున్నాయి. అయితే అక్కడ ఆ భవనం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పాలించారు. కానీ ఏపీలో రిషికొండ భవనాల ముఖం కూడా జగన్మోహన్ రెడ్డి చూడలేదు. కానీ దాదాపు 700 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి భారీ భవంతులు నిర్మించారు. అవి ఎందుకు నిర్మించారో కూడా బయట పెట్టే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ రిషికొండ భవనాల పుణ్యమా అని మాత్రం ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
* గెలుపు భావనతోనే..
వాస్తవానికి 2024 ఎన్నికల్లో సైతం తనదే గెలుపు అని జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) భావించారు. అందుకే రిషికొండ భవనాలను భారీ స్థాయిలో నిర్మించారు. ఇలా గెలిచిన వెంటనే విశాఖకు మకాం మార్చాలని భావించారు. కానీ ఆయన ఒకటి అనుకుంటే ప్రజలు మరోలా అనుకున్నారు. కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి అంచనాలు తప్పాయి. రిషికొండ భవనాల విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే చేజేతులా రిషికొండ భవనాల రూపంలో విమర్సన వస్త్రాలను అందించారు జగన్మోహన్ రెడ్డి. కొన్నేళ్లపాటు రిషికొండ భవనాల విషయంలో జగన్మోహన్ రెడ్డి కార్నర్ కావాల్సిందే.
Also Reda : జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ పిఠాపురం వర్మపై నాగబాబు సెటైర్లు..మండిపడుతున్న టీడీపీ అభిమానులు!