https://oktelugu.com/

Kurnool : పెళ్లి పందిరిలో స్నేహితుడికి గిఫ్ట్ ఇస్తూ.. అంతలోనే పెను విషాదం

మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేని రోజులు ఇవి. అప్పటివరకు స్నేహితులతో ఆనందంగా గడిపిన ఆ యువకుడికి చూసి విధికి కన్ను కొట్టిందేమో. గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది. ఆ పెళ్ళింట విషాదం నింపింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 22, 2024 11:16 am
    Kurnool

    Kurnool

    Follow us on

    Kurnool :  ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు సైతం గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. నడివయస్కులు, యువకులు ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది. ఓ యువకుడు తన స్నేహితుడికి బహుమతి ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెనుమడలో ఓ యువకుడు వివాహానికి వంశీ అనే స్నేహితుడు వచ్చాడు. అందరితో సరదాగా గడిపాడు. స్నేహితులంతా కలిసి నూతన వధూవరులతో ఫోటోలకు దిగారు. ఒక బహుమతి కూడా ఇచ్చారు. ఇంతలో వంశీ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్టేజి పైనే పడిపోయాడు. తోటి స్నేహితులు గమనించేసరికి చనిపోయాడు. అప్పటివరకు స్నేహితుడి పెళ్లిలో సంతోషంగా గడిపిన వంశీ ప్రాణాలు కోల్పోవడంతో.. సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    * స్నేహితుడి వివాహానికి వచ్చి
    బెంగళూరు అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నాడు వంశీ. స్నేహితుడు వివాహం కావడంతో పెనుమడ వచ్చాడు. స్నేహితుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులకు కానుక ఇచ్చేందుకు వెళ్లి వేదిక పైకి ఎక్కాడు. తన స్నేహితులతో కలిసి ఓ గిఫ్ట్ వధూవరులకు అందించి పక్కనే నిలబడ్డాడు. స్నేహితుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ ప్యాక్ ను వధూవరులు ఓపెన్ చేస్తుండగా వంశీ అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని పక్కకు తీసుకెళ్లే లోపే స్టేజి పైన కుప్పకూలాడు. దీంతో తోటి స్నేహితులు డోంట్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వంశీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది.

    * హఠాత్ పరిణామంతో
    అయితే ఈ హఠాత్పరిణామంతో స్నేహితులు షాక్ కు గురయ్యారు. వంశీ మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. మరోవైపు నూతన వధూవరులు సైతం తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తమ వివాహానికి వచ్చి స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఆ పెళ్ళింట కూడా ఎటువంటి సందడి లేకుండా పోయింది. స్నేహితుడి వివాహానికి వచ్చి వంశీ విషాదాంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.