YCP: సేఫ్ జోన్ లోకి వైసిపి నేతలు.. కారణమేంటి?

వైసీపీకి అత్యంత బలంగా ఉండేది సోషల్ మీడియా విభాగం. పోలింగ్ ముగిసిన తర్వాత రోజు వైసీపీ సోషల్ మీడియా కార్యాలయాన్ని మూసివేశారు. ఎవరు ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదని మెసేజ్ చేశారు.

Written By: Dharma, Updated On : May 18, 2024 9:46 am

YCP

Follow us on

YCP: వైసీపీలో ఒక రకమైన భిన్న వాతావరణం కనిపిస్తుంది. మరోసారి అధికారంలోకి వస్తాం అని జగన్ చెప్పినా… ఆయన చెప్పిన ప్లేస్ మాత్రం సరికాదు. పార్టీ సీనియర్లతోనో.. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసో ఆ విషయం చెప్పాలి. కానీ ఆయన మాత్రం కోట్లాది రూపాయలు చెల్లించే ఐప్యాక్ టీం వద్ద చెప్పడం మాత్రం విమర్శలకు గురిచేస్తోంది. పార్టీ శ్రేణులకు సైతం ధైర్యం చాలడం లేదు. నేతలు ధీమా వ్యక్తం చేయడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి పొడి పొడిగా మాట్లాడి వెళ్ళిపోతున్నారు. వైసిపి ఫైర్ బ్రాండ్లలో ఒక్కరు కూడా స్పందించడం లేదు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

వైసీపీకి అత్యంత బలంగా ఉండేది సోషల్ మీడియా విభాగం. పోలింగ్ ముగిసిన తర్వాత రోజు వైసీపీ సోషల్ మీడియా కార్యాలయాన్ని మూసివేశారు. ఎవరు ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదని మెసేజ్ చేశారు. వచ్చే నెల వరకు సెలవులు ఇచ్చామని కొంతమందికి.. పూర్తిగా తీసేసామని మరి కొంతమందికి సమాచారం ఇచ్చారు. సోషల్ మీడియా విభాగం అధిపతి సజ్జల భార్గవ్ రెడ్డి కూడా కనిపించడం లేదు. ఎవరికీ అందుబాటులో లేరు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాతో పాటు సజ్జల భార్గవరెడ్డి పై ఈసీ ఆదేశాల మేరకు కేసులు నమోదయ్యాయి. బహుశా ఈ భయంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.

వైసీపీలో నగదు వ్యవహారాలు చూసేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తన కనుసన్నల్లో రాయలసీమ రాజకీయాలను శాసించారు ఆయన. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఈ ఎన్నికల్లో అంతా తామై వ్యవహరించారు. కానీ పోలింగ్ తరువాత అనూహ్యంగా సైలెంట్ అయ్యారు. కనీసం పెద్దిరెడ్డి ప్రస్తుతం మాట్లాడడానికి కూడా సాహసించడం లేదు. ప్రస్తుతం తన అస్మదీయ కంపెనీలకు బిల్లుల చెల్లింపుల పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తన ఆస్తులను వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఫలితాలు వచ్చే రోజు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వైసిపి ఫైర్ బ్రాండ్లుగా పేరు పొందిన కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, జోగి రమేష్ వంటి నేతల స్పందన లేదు. కనీసం ఫలితాలపై మాట్లాడడం లేదు. అయితే ఇంటలిజెన్స్ హెచ్చరికలతోనే వారు మౌనం దాల్చారని టాక్ నడుస్తోంది. ఎన్నికల ఫలితాల రోజు కూడా అనుచరులకు పురమాయించి వారు సేఫ్ జోన్ లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.