ఆంధ్రప్రదేశ్‌YCP: వైసీపీ నేతలకు నాన్ బెయిలబుల్ కేసుల భయం

YCP: వైసీపీ నేతలకు నాన్ బెయిలబుల్ కేసుల భయం

YCP: వైసిపి నేతల్లో కొత్త టెన్షన్ ప్రారంభమైంది. ఒకవైపు టిడిపి కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రముఖ సెఫాలజిస్టుల విశ్లేషణ ప్రకారం వైసీపీకి ఓటమి ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అరెస్టులు, నాన్ బెయిలబుల్ కేసులు వెంటాడుతున్నాయి. పోలింగ్ నాడు, పోలింగ్ తర్వాత ఏపీలో విధ్వంసాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల, పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. తీవ్ర విధ్వంసం చెలరేగింది. రక్తపాతం జరిగింది. అయితే ఘటనకు కారణమైన వారిపై చిన్న చిన్న కేసులు నమోదు చేయడాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తప్పు పట్టింది. అదనపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. అదే జరిగితే హత్యాయత్నం కేసులతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడం ఖాయం. అరెస్టులు జరగడం కూడా ఖాయంగా తేలుతోంది.

ఏపీలో జరిగిన అల్లర్లపై 13 మంది అధికారులతో కూడిన అత్యున్నత దర్యాప్తు బృందం సిట్ ను నియమించిన సంగతి తెలిసిందే. మూడు రోజులపాటు దర్యాప్తు చేసిన సిట్.. కీలక నివేదికలను ఈసీకి సమర్పించింది. వైసీపీ నేతలు చెప్పిన విధంగానే కిందిస్థాయి పోలీసులు వ్యవహరించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సిట్ నివేదిక ఇచ్చింది. దీంతో ఇటు అధికారులు, అటు వైసిపి నేతల్లో ఒక రకమైన టెన్షన్ ప్రారంభమైంది.అల్లర్లకు పాల్పడిన వారిపై కీలక నేతల ఆదేశాల మేరకు బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు సీట్ గుర్తించింది. ఎంతటి విధ్వంసకాండ కు పూనుకుంటే చిన్నచిన్న కేసులతో సరిపెడతారా అని సీట్ ప్రశ్నించింది. ఎవరెవరు సిఫార్సులు చేశారో ఆరా తీసింది. దీంతో ఇప్పుడు అదనపు సెక్షన్లను జోడిస్తున్నారు. హత్యాయత్నంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో తాము ఇరకాటములో పడడం ఖాయమని అధికార పార్టీ నేతల్లో ఒక రకమైన అలజడి కనిపిస్తోంది.

పల్నాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలో దూరి.. ఈవీఎంలను నేలకొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. అడ్డొచ్చిన టిడిపి ఏజెంట్ పై దాడి కూడా చేయడంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించి చిన్న చిన్న కేసులు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడినట్లు పేర్కొంటూ చిన్న చిన్న సెక్షన్ల కింద కేసు కట్టారు. ఇప్పుడు సిసి పూటేజీలో పిన్నెల్లి విధ్వంసం వెలుగులోకి రావడంతో.. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మరోవైపు ఎక్కడికక్కడే తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ ఎస్టీలు సిట్ బృందం ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఇప్పుడు అదనంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను కూడా నమోదు చేస్తున్నారు. ఒకవేళ జూన్ 4న వైసిపి ఓడిపోతే.. కేసులు నమోదైన వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టడం ఖాయం. అదే గెలుపొందితే మాత్రం ఆ పార్టీ నేతలకు ఉపశమనం కలగనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version