YS Jagan : ‘151’లో ఐదు మాయం… వైసీపీ, జగన్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు.. మీమ్స్ వైరల్

వైసిపి ఓడిపోయిన నాటి నుంచి ఇలా సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. మీమ్స్ దర్శనమిస్తూనే ఉన్నాయి. అందులో ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే.. ఇంకా చాలా ఉన్నాయి.

Written By: NARESH, Updated On : June 6, 2024 10:34 pm

With YCP's defeat, netizens' troll memes on YS Jagan have gone viral

Follow us on

YS Jagan : లక్షల కోట్లు ఖర్చుపెట్టి సంక్షేమ పథకాలు అమలు చేశామని జగన్ చెప్పాడు. సిద్ధం పేరుతో సభలు నిర్వహించాడు. లక్షల మంది వచ్చారని సాక్షి రాసింది. సంబరాలు చేసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చాడు. విశాఖపట్నం వేదికగా ప్రమాణ స్వీకార సభ ఉంటుందని ప్రకటించాడు. హోటళ్లు, ఇతర వాటిని బుక్ చేసుకోవాలని ప్రకటించాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం అక్కడే ఉంటుందని చెప్పాడు. ఫలితంగా వైసీపీ విక్టరీ ఖాయమని.. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధిస్తే.. ఈసారి అంత కాకపోయినా మెరుగైన సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని వైసిపి కార్యకర్తల్లో ఒక నమ్మకం ఉండేది. కానీ తీరా ఫలితాలు వచ్చిన తర్వాత.. వై నాట్ 175 గాలికి కొట్టుకుపోయింది. ప్రమాణ స్వీకారం ఊకదంపుడు ఉపన్యాసం అయిపోయింది. చివరికి కూటమి కొట్టిన దెబ్బకు వైసిపికి 11 స్థానాల మార్క్ మిగిలింది.

వైసిపి ఘోర ఓటమిని ఎదుర్కొన నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో బిజెపి, టిడిపి, జనసేన నాయకులు పోస్టులు పెడుతున్నారు..మీమ్స్ తో సందడి చేస్తున్నారు. సినిమాలలో వీడియోలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు.. గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే వరస కొనసాగుతోంది.. ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల పాటు జగన్ పరిపాలన కాలంలో చోటు చేసుకున్న అవకతవకలను వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.. ఇందులో మచ్చుకు కొన్ని..

ఎక్కడికైనా పారిపోవాలి

“ఇన్నాళ్లు అన్నయ్యను చూసుకొని అందరినీ బూతులు తిట్టాం.. ఇప్పుడు ఊహిస్తేనే భయంగా ఉంది. అర్జెంటుగా యూజీ (అండర్ గ్రౌండ్) కి మింగేయాలి.”

ఇదీ దేవుడి స్క్రిప్ట్

“వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు చూస్తే 11 మిగిలాయి. ఇదీ దేవుడి స్క్రిప్ట్ అంటే.. ఇప్పటికైనా అర్థమైందా”

పేటీఎం బ్యాచ్ బంపర్ ఆఫర్

“అన్నయ్యకు పేటీఎం బ్యాచ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పేటీఎం కూలీ 5 ఇవ్వనందుకు 151 సీట్లల్లో ఐదు ఎగరగొట్టి.. 11 మాత్రమే మిగిల్చారు”

జనం పీకేశారు

“సిద్ధం సభలో ప్రతిపక్షాలు నా వెంట్రుక కూడా పీకలేరు అన్నారు. ఇప్పుడు జనమే పీకి అవతల పడేశారు”

పసుపు రంగు వేశారు

“ఎవరో కట్టిన ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర భవంతులకు బులుగు రంగు వేస్తే.. ప్రజలు తిరస్కరించారు. పసుపు రంగుతో సరికొత్త చరిత్ర సృష్టించారు”.

అప్పుడు దండం.. ఇప్పుడు పిండం

“చిరంజీవిని అవమానించిన జగన్ కు తమ్ముడు పవన్ బాగా బుద్ది చెప్పాడని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. .

11 మందితో ప్రమాణస్వీకారం చేద్దాం

“విశాఖపట్నంలో 11న ప్రమాణస్వీకారం ఉందని చెప్పారు. హోటల్ రూమ్స్ మొత్తం బుక్ చేసాం. ఇప్పుడు చెప్పు అన్నయ్య ఆ 11 మందితో కలిసి ప్రమాణస్వీకారం చేద్దామంటావా.. లేక ఆ రూమ్స్ మొత్తం ఖాళీ చేయమంటావా”.

మూడు అచ్చికి రాలేదు.. ఐదు చేసేద్దాం

“ఈ ఎన్నికల్లో మూడు రాజధానుల నిర్ణయం అచ్చికి రాలేదు. వచ్చే ఎన్నికల్లో ఐదు రాజధానులు చేస్తామని చెబుదాం.”

వైసిపి ఓడిపోయిన నాటి నుంచి ఇలా సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. మీమ్స్ దర్శనమిస్తూనే ఉన్నాయి. అందులో ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే.. ఇంకా చాలా ఉన్నాయి.