Homeఆంధ్రప్రదేశ్‌Modi - Chandrababu Naidu : మోడీపై ప్రేమతోనా? భయంతోనా? చంద్రబాబు కీలక స్టెప్

Modi – Chandrababu Naidu : మోడీపై ప్రేమతోనా? భయంతోనా? చంద్రబాబు కీలక స్టెప్

Modi – Chandrababu Naidu : ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరికి ఎవరు మిత్రులో.. ఎవరు శత్రువులో అన్నది అర్ధం కాకుండా పోతోంది. ఏపీలో కలహించుకుంటున్న పార్టీలు ఢిల్లీ నిర్ణయాలకు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నాయి. సంయక్తంగా మద్దతు తెలుపుతున్నాయి. అయితే ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలకంటే అదీ కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పోటీపడి మరీ మద్దతు తెలుపుతున్నారు. జాతీయ స్థాయిలో మన నేతలు పలుచన అవుతున్నారు. చంద్రబాబు అంతటి వారు కూడా భయంతోనే కీలక స్టెప్ లు వేస్తున్నారు. పొలిటికల్ గా ఇది చర్చనీయాంశమవుతోంది.

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం విషయం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. మోదీ మాత్రం తానే చేస్తానని ముందుకొస్తున్నారు. దీంతో ఈ వివాదం జఠిలమవుతోంది. 19 విపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాయ్ కట్ చేశాయి. కార్యక్రమానికి హాజరుకాలేమని తేల్చేశాయి. అయితే జగన్ మాత్రం తాను హాజరవుతున్నట్టు తెలిపారు. అంతటితో ఆగకుండా బాయ్ కట్ నిర్ణయాన్ని ప్రకటించిన విపక్షాలను తప్పుపట్టారు.కొన్నిరకాల సూక్తులు కూడా వల్లించారు. మీ కేసుల అవసరాలు చూసుకోండి.. మాకు సలహాలు ఇచ్చేది ఏంటి అంటూ విపక్షాలు సైతం అటాక్ చేశాయి.

అయితే ఈ విషయంలో అందిరి దృష్టి చంద్రబాబుపై పడింది. ఆయన తమ రూట్లోకి వస్తాడని విపక్షాలు భావించాయి. అలా రాకున్నా తటస్థంగా ఉంటారని అనుకున్నాయి. కానీ ఆయన సైతం మోదీ మంచి పనిచేస్తున్నాడే అంటూ ప్రకటించడంతో విపక్షాల నోటిలో పచ్చి వెలక్కాయపడినట్టయ్యింది. రాజమండ్రిలో పార్టీ మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలపై పార్టీ పోలిట్ బ్యూరోలో చర్చించారు. సంక్షేమం గురించి వైసీపీ చేస్తున్న విమర్శలపైన చర్చకు వచ్చింది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యూహాలపై సంకేతాలు ఇచ్చారు. కానీ జగన్ అనుకూల ప్రకటననే సమర్థిస్తూ ప్రధాని మోదీ మంచి పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

జాతీయ స్థాయిలో మాత్రం ఏపీ నేతల పరువు పోయింది. ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన ప్రధాన పార్టీలు. అయితే కేంద్రం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ఏ పార్టీ కూడా ఖండించిన దాఖలాలు లేవు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న అనుకూల కామెంట్స్ తో ట్విట్టర్ లో నింపేస్తున్నాయి. అయితే అందరికీ మించి చంద్రబాబు ఈ వయసులో కూడా భయపడుతూ కనిపిస్తుండడాన్ని జాతీయ నాయకులు తప్పుపడుతున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలకే చూసుకుంటే ఇప్పటివరకూ ఉన్న మంచి పేరు పోతుందని చెబుతున్నాయి. అయితే ఏపీలో అధికారంలో రావడం అన్న ఏకైక అజెండాతో పనిచేస్తున్న చంద్రబాబు.. ఇప్పట్లో కేంద్రానికి ఎదురుతిరిగే చాన్స్ లేదంటున్నారు విశ్లేషకులు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular