AP BJP President Purandeswari
AP BJP President Purandeswari : ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు హీట్టెక్కాయి. వైసీపీ నుంచి చేరికల పర్వం ప్రారంభం అయ్యింది. ఈరోజు ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో టిడిపిలో చేరుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా.. బిజెపిలోకి నలుగురు వెళ్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. టిడిపిలోకి ముగ్గురు, జనసేనలోకి ఇద్దరు జంప్ చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే వీరంతా వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. అక్కడకు వెళ్లిన తర్వాత పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తారు అన్నది ఒక ప్రచారం. ఇటువంటి నేపథ్యంలో బిజెపి కొన్ని షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో రాజ్యసభ సభ్యుల చేరిక విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. నేతల గుణగణాలను పరిగణలోకి తీసుకున్నాక.. నచ్చితేనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పుకొచ్చారు.
* కొల్లం గంగిరెడ్డి చేరిక విషయంలో
వైసీపీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బిజెపిలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై తాజాగా పురందేశ్వరి స్పందించారు. ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే బిజెపిలో చేరికల విషయంలో చాలా కొలమానాలు ఉంటాయని.. అవన్నీ దాటాక పార్టీలో చేర్చుకుంటామని ఆమె చెబుతున్నారు. అయితే రాజ్యసభ సభ్యుల విషయంలో ఈ ఫార్ములా వర్తిస్తుందా? అన్నది ఒక ప్రశ్న. అయితే రాజ్యసభ సభ్యుల విషయంలో ఆమెకు సమాచారం లేదన్న వార్త ఒకటి హల్చల్ చేస్తోంది.
* బిజెపి అవసరాలరీత్యా
బిజెపికి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. చాలామంది రాజ్యసభ సభ్యులు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసి గెలిచారు. మరికొందరి పదవీకాలం ముగిసింది. దీంతో బీజేపీ సభ్యులు సంఖ్య తగ్గడంతో రాజ్యసభలో ఇబ్బందికర పరిస్థితి ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభలో బలం పెంచుకోవాలని బిజెపి భావిస్తోంది. అందుకు చంద్రబాబు భారీ స్కెచ్ వేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులను ఎక్కువగా బిజెపిలోకి పంపిస్తున్నారు.
* నేరుగా హ్యాండిల్ చేస్తున్న హై కమాండ్
వైసీపీ రాజ్యసభ సభ్యుల చేరిక విషయంలో నేరుగా బిజెపి హై కమాండ్ హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపిలో చేరబోతున్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేశారు. పదవులను సైతం వదులుకున్నారు. అయితే వారినే మళ్లీ పార్టీ తరఫున ఎన్నుకోనుంది టిడిపి. అయితే బిజెపికి ఆ చాన్స్ లేదు. బిజెపి ఎంపీలుగా గెలవాలంటే టిడిపి మద్దతు కీలకం. అందుకే వైసీపీ రాజ్యసభ సభ్యుల చేరికల విషయంలో హై కమాండ్ నేరుగా చంద్రబాబుతోనే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పురందేశ్వరికి సమాచారం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Will purandeshwari be sidelined by the bjp high command only with chandrababus intervention
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com