Chandrababu: తెలంగాణలో చంద్రబాబు అద్భుత వ్యూహం ఫలిస్తుందా?

తెలంగాణలో సెటిలర్స్ ప్రభావం అధికం. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించింది టిఆర్ఎస్. కానీ సెటిలర్స్ అధికంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్,నల్గొండ,ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ పట్టు సాధించలేకపోయింది.గ్రేటర్ హైదరాబాదులో సత్తా చాటేందుకు చాలా రోజుల సమయం పట్టింది. అయితే క్రమేపీ తెలంగాణ సెంటిమెంట్ బలంగా వ్యాపించింది.

Written By: Dharma, Updated On : July 9, 2024 1:45 pm

Chandrababu

Follow us on

Chandrababu: అమరావతి : ఏపీ ఎన్నికల్లో గెలిచారు చంద్రబాబు.జనసేన, బిజెపితో జతకట్టి మరి జగన్ ను మట్టి కరిపించారు. అటు తెలంగాణలో సైతం కేసీఆర్ ను అక్కడ ప్రజలు తిరస్కరించారు.ఏపీ మాదిరిగానే భావోద్వేగాలు కనుమరుగయ్యాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధిని ఆహ్వానిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తెలంగాణలో టిడిపి పూర్వవైభవానికి అద్భుత వ్యూహంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ప్రధానంగా ఆంధ్రా సెటిలర్స్ ఆధారంగా చేసుకుని రాజకీయాలను నడపాలని భావిస్తున్నారు. తద్వారా టిడిపి పూర్వ వైభవానికి తహతహలాడుతున్నారు.

* సెటిలర్స్ ప్రభావం అధికం..
తెలంగాణలో సెటిలర్స్ ప్రభావం అధికం. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించింది టిఆర్ఎస్. కానీ సెటిలర్స్ అధికంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్,నల్గొండ,ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ పట్టు సాధించలేకపోయింది.గ్రేటర్ హైదరాబాదులో సత్తా చాటేందుకు చాలా రోజుల సమయం పట్టింది. అయితే క్రమేపీ తెలంగాణ సెంటిమెంట్ బలంగా వ్యాపించింది. సెటిలర్స్ సైతం సెంటిమెంట్ కు జై కొట్టక తప్పలేదు. టిఆర్ఎస్ దూకుడుకు సెటిలర్స్ తల వంచాల్సి వచ్చింది.అయితే భయపెట్టే టిఆర్ఎస్ పోయింది. ఎటువంటి ఇబ్బందులు పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.అదే సమయంలోసెటిలర్స్ కు బిజెపి భరోసా ఇస్తోంది.అందుకే ఇప్పుడు సెటిలర్స్ ప్రభావం అధికంగా ఉంది.స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు రంగంలోకి దిగారు చంద్రబాబు.టిడిపి పూర్వవైభవాన్ని బలంగా కోరుతున్నారు. దానికి సెటిలర్స్ మద్దతు కూడగడుతున్నారు.

* క్యాడర్ యూ టర్న్..
పేరుకే టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్..కానీ అక్కడ ఉన్నదంతా టిడిపి కేడరే.తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకులు కెసిఆర్ ఆడిన రాజకీయంతో ఆయన గూటికి చేరక తప్పలేదు. అటు క్యాడర్ సైతం బలవంతంగా ఆ పార్టీలో సర్దుబాటు అవుతూ వచ్చింది.అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో కెసిఆర్ ను వద్దనుకున్నారు. అందుకే ఆ పార్టీ క్యాడర్ ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ తో పాటు బిజెపి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే పూర్వాశ్రమంలో టిడిపి క్యాడర్ కావడంతో ఆలోచనలో పడింది. ఇప్పుడు చంద్రబాబు పిలుపు మేరకు ఆ క్యాడర్ కొంత టిడిపి వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* ఏపీలో సక్సెస్ తో..
ఏపీలో కూటమి సక్సెస్ అయ్యింది. మూడు పార్టీలను ప్రజలు ఆహ్వానించారు. ఆశీర్వదించారు కూడా. అందుకే తెలంగాణలో సైతం ఆ మూడు పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి. 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఒంటరి పోరు చేసింది. కానీ అనుకున్న స్థాయిలో సీట్లను దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు టిడిపి పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తే మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. సెటిలర్స్ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఓటు బ్యాంకు పెంచుకునే ఛాన్స్ కనిపిస్తోంది. చంద్రబాబుకు పవన్ బలం తోడైతే అదనపు బలమే. దీనికి బిజెపి దూకుడు తోడైతే.. ఏపీ ఫలితాలు రిపీట్ చేయవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కూటమిని ఒక తుది రూపానికి తేవాలని భావిస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.