Minister Roja : ఇటీవల మంత్రి రోజా మీద టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. నీలి చిత్రాలలో నటించిన రోజా… టీడీపీలో ఉన్నప్పుడు క్యాంపైన్ కి వచ్చి ఎలాంటి పనులు చేసిందో తెలుసంటూ వివాదాస్పద కామెంట్స్ చేశాడు. రాజకీయ వర్గాల్లో బండారు సత్యనారాయణ కామెంట్స్ ప్రకంపనలు రేపాయి. కన్నీటి పర్యంతమైన రోజా బండారు సత్యనారాయణ మీద ఫైర్ అయ్యింది. మహిళా కమీషన్ బండారు సత్యనారాయణకు నోటీసులు ఇవ్వడమైంది. బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.
రోజాకు మద్దతుగా కుష్బూ, రాధ, మీనా, నవనీత్ కౌర్, రమ్యకృష్ణ వంటి హీరోయిన్స్ గళం విప్పారు. రోజా మీద బండారు కామెంట్స్ సభ్యసమాజం తలదించుకునేలా ఉండాయని అభిప్రాయపడ్డారు. బండారు సత్యనారాయణ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతో పాటు రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే టాలీవుడ్ నుండి ఒక్కరు కూడా రోజాకు మద్దతు తెలపలేదు. ఆ విషయం మీద మాట్లాడలేదు.
ఇందుకు కారణం ఏంటనే చర్చ మొదలైంది. ఇందుకు ప్రధాన కారణం టాలీవుడ్ పొలిటికల్ ఈవెంట్స్ పై స్పందించడం లేదు. ఇదే చర్చ నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా వచ్చింది. టాలీవుడ్ పెద్దలు చంద్రబాబు అరెస్ట్ ని ఖండించాలను పలువురు టీడీపీ నేతలు కోరుకున్నారు. ‘సప్త సాగరాలు దాటి’ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సురేష్ బాబుకు ఈ ప్రశ్న ఎదురైంది. చంద్రబాబు అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏమిటనగా… చిత్ర పరిశ్రమ నాన్ పొలిటికల్, నాన్ రెలిజియస్. నటులు పొలిటికల్ కామెంట్స్ చేయరు.
ఎవరైనా రాజకీయాల గురించి మాట్లాడితే అది వాళ్ళ వ్యక్తిగతం. పరిశ్రమ తరపున పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కుదరదు అన్నారు. చంద్రబాబుతో పాటు అనేక మంది సీఎంలు చిత్ర పరిశ్రమకు మేలు చేశారు. కాబట్టి ఆయన అరెస్ట్ మీద స్పందించడం సరికాదు అన్నారు. ఇదే సూత్రాన్ని రోజా విషయంలో కూడా టాలీవుడ్ పాటించి ఉండవచ్చు. అలాగే నటులకు అభిమానులు ఉంటారు. వాళ్లు వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు కావచ్చు. అందుకే రోజా-బండారు సత్యనారాయణ వివాదంలో టాలీవుడ్ మౌనం వహించి ఉండవచ్చు.