Chandrababu-Pawan : సినీ నటుడు.. పవర్ స్టార్.. జన సేన అధినేత పవన్ కల్యాణ్. ఈయనకు నటుడిగా, రాజకీయ నేతల కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పవన్‌కు అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా వారు బ్రహ్మరథం పడతారు. ఇటీవల నిర్వహించిన వారాహి యాత్రకు భారీగా అభిమానులు తరలి వచ్చి చరిత్ర సృష్టించారు. ఇంతటి అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్‌కు అభిమాన నేత ఎవరు అంటే.. చంద్రబాబు అంటున్నారు. ఆశ్చర్యంగా అనిపించినా చాలా మంది పవన్‌కు చంద్రబాబు అంటే చాలా ఇష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోట్ల మంది అభిమానులు ఉన్న పవన్.. చంద్రబాబు కోసం పరితపిస్తున్నాడు అన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
బాబు అరెస్ట్ తర్వాత..
ఇక ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకుడు అరెస్ట్ తర్వాత పవన్ స్పందించిన తీరు కూడా ఆయనపై పవన్‌కు ఉన్న అభిమానం తెలియజేసుందని అంటున్నారు. లక్షలాది మంది అభిమానుల ప్రేమ, విధేయతను ఆయన ఆదేశిస్తూనే, పవన్ కళ్యాణ్ తనకంటే పెద్దవాడు.. ఆలోచన విధానంలో.. అభివృద్ధి ఎజెండా.. అరాచక పాలన అంతం చేయడం విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకేవిధంగా ఉండడంతో పవన్ మాజీ సీఎం చంద్రబాబును అభిమానిస్తారు.
నాడు పవన్ ఇంటికి వెళ్లిన బాబు..
2014 ఎన్నికల సమయంలో అయితే చంద్రబాబే స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, అభివృద్ధి అజెండా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత స్వయంగా తన వద్దకు వచ్చి మద్దతు కోరడంతో నాడే పవన్ కాదనలేకపోయారు. విజనరీ నేతగా చంద్రబాబును అభివర్ణించారు. తాజాగా విశాఖలో పవన్‌ను పోలీసులు నిర్భందించిన సమయంలోనూ చంద్రబాబు జనసేనానికి అండగా నిలిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్న జన సేనాని కోసం కొన్ని సీట్లు వదులుకోవడానికి కూడా బాబు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే పవన్‌కు బాబుపై అభిమానం ఉంది. అందుకే బాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఖండించారు. వెంటనే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్..
చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైలుకెళ్లడంపై చాలా మంది టీడీపీ నేతల కంటే పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎక్కువగా ఉందన్న అభిప్రాయం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు. పవన్ అసలైన రాజకీయ నాయకుడిగా స్థిరపడాలంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబును దూరంగా ఉంచడమే మేలన్న అభిప్రాయం పవన్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అప్పుడే పవన్ రాజకీయాల్లో షైన్ అవుతాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాబుతో వెళ్తే.. జనసేనకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.