https://oktelugu.com/

NTR Jayanthi Mahanadu : మహానాడులో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు లేరు..? అసలేమైంది..?

ఇప్పటి వరకు నిర్వహించిన మహానాడుకు నందమూరి వారసులు ఎక్కువగానే వచ్చేవారు. తొలిసారి బాలకృష్ణ మినహా మరో నందమూరి వారసుడు ఇక్కడ కనిపించ లేదు.

Written By: , Updated On : May 28, 2023 / 10:24 PM IST
Follow us on

NTR Jayanthi Mahanadu : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి వేదికగా తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా మహానాడు నిర్వహిస్తోంది. ఈ మహానాడుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ నాయకులతోపాటు దేశ, విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు భారీగా హాజరయ్యారు. అంతా బాగానే ఉన్నా మహానాడును పరిశీలిస్తున్న అన్న గారి అభిమానులను ఒక చిన్న సందేహం తెగ గొలికేస్తోంది. అదే మహానాడుకు దూరంగా జరిగిన అన్న గారి కుటుంబ సభ్యులు. మహానాడులో నందమూరి కుటుంబ సభ్యులు ఎవరు కనిపించకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నందమూరి కుటుంబ సభ్యులను మహానాడుకు దూరంగా పెట్టారా..? లేక వాళ్లే దూరంగా జరిగారా..? అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది.

మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ చేసుకునే అతి పెద్ద పండగ. ఈ పండగలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అంతా భారీగా హాజరవుతుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రాజమండ్రి వేదికగా జరుగుతున్న మహానాడులో మాత్రం నందమూరి కుటుంబ సభ్యుల ఎవరు కనిపించకపోవడం గమనార్హం.

బాలకృష్ణ మినహా కనిపించని నందమూరి వారసులు..

రాజమండ్రి వేదికగా జరుగుతున్న మహానాడులో నందమూరి వారసులు ఎవరు కనిపించలేదు. వేదికపై నందమూరి బాలకృష్ణ మాత్రమే కనిపించాడు. నందమూరి అభిమానులకు బాలకృష్ణ కనిపించడం ఆనందాన్ని కలిగించినప్పటికీ మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరు రాకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన మహానాడుకు నందమూరి వారసులు ఎక్కువగానే వచ్చేవారు. తొలిసారి బాలకృష్ణ మినహా మరో నందమూరి వారసుడు ఇక్కడ కనిపించ లేదు. దీంతో నందమూరి అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అంతర్మధనం చెందుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఎందుకు మహానాడుకు రాలేదనే చర్చ పెద్ద ఎత్తున ఇక్కడకు హాజరైన వారిలో జరిగింది.

ఆ కుటుంబ సభ్యులంతా ఎక్కడ ఉన్నారు..

నందమూరి కుటుంబంలో ఉన్నప్పటికీ నారా కుటుంబానికి దూరంగా ఉంటున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. నారా చంద్రబాబు నాయుడుతో కొంత ఇబ్బందులు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాడు. తండ్రి హరికృష్ణ చనిపోయిన తర్వాత ఈ దూరం మరింత పెరిగింది. తమ్ముడితో ఈ మధ్యకాలంలో సన్నిహితంగా ఉంటున్న కళ్యాణ్ రామ్ కూడా నారా కుటుంబానికి దూరం అయ్యారు. వీరిద్దరూ మినహా మిగిలిన వారంతా నారా కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే, వారెవరు ఈ సదస్సులో పాల్గొనక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు కుమారులు పలువురు బతికే ఉన్నప్పటికీ వారు ఎవరూ ఈ సదస్సులో పాల్గొనలేదు. అలాగే, బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఎవరూ మహానాడుకు వచ్చినట్లు కనిపించలేదు. దీంతో నందమూరి కుటుంబంలో ఏదో జరుగుతోంది అన్న అనుమానం నందమూరి అభిమానులు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ఇదే అదునుగా ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా నందమూరి కుటుంబాన్ని దూరం చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలను గుప్పిస్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.