Nara lokesh : లోకేష్ విదేశాలకు వెళ్లారా? అందుకే ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారా? విదేశాల్లో ఏదో వ్యవహారాలు నడిపారా? వైసిపి చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ.సోషల్ మీడియా వేదికగా వైసిపి, టిడిపిల మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది.’ హే లోకేష్.. జూలై 30 నుంచి ఆగస్టు 5 వరకు నువ్వు దేశం విడిచి ఎక్కడికి వెళ్లావు? ఎవరితో చెప్పకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా ఏ దేశానికి వెళ్లావు? విదేశాల్లో నువ్వు చేసిన ఘనకార్యాలు ఏంటి?’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. దానిని లోకేష్ ఎక్స్ ఖాతాకు హ్యాండిల్ ను ట్యాగ్ చేసింది. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది. దీనికి స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు లోకేష్.’ ఫేక్ జగన్.. నాది రెడ్ బుక్ మాత్రమే కాదు.. ఓపెన్ బుక్ కూడా. నీలాగా నాకు క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్ కేసులు లేవు. విదేశాలకు వెళ్లాలంటే స్వేచ్ఛగా వెళ్లగలను. నీ మాదిరిగా కోర్టులో కేసులు కూడా లేవు. కోర్టుల అనుమతితో వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో విదేశాలకు వెళ్లాను అంటూ బదులిచ్చారు. ప్రజలు కొట్టిన దెబ్బకు మైండ్ పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఇటువంటి ఫేక్ మెసేజ్ లు మానుకోవాలని హితవు పలికారు. లేకుంటే ప్రజలు ఊరుకోరని కూడా హెచ్చరించారు.
* లోకేష్ రియాక్షన్
అయితే లోకేష్ అంతటితో ఆగలేదు. ఒక పోస్టును వైసీపీకి ట్యాగ్ చేశారు. చిల్ బ్రో.. సరే కానీ బాబాయిని లేపేసింది ఎవరో చెప్పే దమ్ముందా జగన్? అంటూ తన పోస్టులో దీటుగా ప్రతిస్పందించారు. ఫేక్ జగన్, ఆంధ్రప్రదేశ్ అంటూ హ్యాష్ ట్యాగులను తన పోస్టుకు లోకేష్ జోడించారు. తన విదేశీ టూర్ కు సంబంధించిన ట్రాన్సిట్ పత్రాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకుని తాను జర్మనీలో పర్యటించినట్లు చెప్పుకొచ్చారు.అయితే లోకేష్ జవాబుతో వైసిపి ఏకీభవించలేదు.
* గోప్యత ఎందుకు?
మేము అడిగిన వరకు లోకేష్ తన పర్యటన వివరాలను ఎందుకు బయట పెట్టలేదని కొత్త వాదనను ఎంచుకుంది వైసిపి. లోకేష్ చివరకు నిజం ఒప్పుకోక తప్పలేదు అంటూ ఎద్దేవా చేసింది. మంత్రి పదవిలో ఉండి కూడా ప్రజలకు ఎందుకు చెప్పకుండా విదేశీ పర్యటన చేశారని ప్రశ్నించింది. మేము ప్రశ్నించే వరకు ఎందుకు బయట పెట్టలేదని నిలదీసినంత ప్రయత్నం చేస్తున్నారు. నాడు జగన్ విషయంలో అనుసరించిన తీరును గుర్తు చేస్తున్నారు.
* టార్గెట్ యువనేత
వైసీపీ వ్యవహార శైలి చూస్తుంటే లోకేష్ టార్గెట్ చేసుకోవాలని కనిపిస్తోంది. ఇప్పటికే రెడ్ బుక్ పేరిట లోకేష్ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో లోకేష్ ను నియంత్రించడానికి వైసిపి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. అందుకే లోకేష్ విదేశీ పర్యటనను టార్గెట్ చేసుకుంది. అయితే దీనికి స్ట్రాంగ్ గానే రియాక్ట్ అవుతున్నారు లోకేష్. సోషల్ మీడియాలో ఇటు టిడిపి, అటు వైసిపి మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More