BJP Vs YCP : బీజేపీతో వైసీపీకి ఎక్కడ చెడిందంటే?

తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి మాత్రం చంద్రబాబే కనిపిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ మద్దతు అవసరం లేదని అక్కడి బీజేపీ నాయకులు చెబుతున్నా ఎన్డీఏ బలోపేతంలో భాగంగా చంద్రబాబు

Written By: Dharma, Updated On : June 16, 2023 8:43 am
Follow us on

BJP Vs YCP : గత నాలుగేళ్లుగా బీజేపీ, వైసీపీ మధ్య స్నేహం అంతా ఇంతా కాదు. అవసరమైన సందర్భాల్లో పరస్పర సహకారం అందించుకునేవి. ఒక్క ఎన్డీఏలో చేరలేదు. కానీ అంతకు మించిన బంధం రెండు పార్టీల మధ్య ఉండేది. ప్రధాని మోదీ, షా ద్వయం వద్ద జగన్ కు ప్రత్యేక స్థానం ఉండేది. కోరిన వెంటనే వారి అపాయింట్ మెంట్ లభించేది. అప్పులకు అనుమతులు వచ్చేవి. ఇలా నాలుగేళ్ల కాలం కరిగిపోయింది. అవసరాలు తీరిపోయాయి. మనసులు మారిపోయాయి. ఇప్పుడు వైరి వర్గాలుగా విడిపోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. బీజేపీ అడిగిన ఒకే ఒక కోరికకు వైసీపీ నో చెప్పడంతో రెండు పార్టీల మధ్య ఎడబాటు ప్రారంభమైంది.

కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత స్ట్రాటజీ మార్చుకుంది. కాంగ్రెస్ గెలుపును.. తమ విజయంగా విపక్షాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో అవి పట్టుబిగిస్తే 2024 ఎన్నికలు తేడా కొడతాయని అగ్రనేతలు ఆందోళనతో ఉన్నారు. అదే జరిగితే నమ్మదగిన మిత్రులెవరు అంటూ శోధన ప్రారంభించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మిత్రులను చేరదీయాలని భావించారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి నమ్మదగిన మిత్రుడు జగనేనని నిర్థారణకు వచ్చారు. ఎన్టీఏలోకి రమ్మని కోరారు. అయితే దీనికి జగన్ నో చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాత మిత్రుడు చంద్రబాబు వైపు బీజేపీ చూడాల్సి వచ్చింది.

బీజేపీతో కలిస్తే సంప్రదాయ ఓటుకు గండిపడుతుందని జగన్ కు తెలుసు. ముస్లీం, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకు. బీజేపీతో జగన్ కలిస్తే ఆ వర్గం పునరాలోచనలో పడుతుంది. ఓటు ఇతర పార్టీలకు కన్వర్టయ్యే అవకాశం ఉంది. అందుకే జగన్ తాను ఎన్డీఏలో చేరలేనని.. బీజేపీతో కలిసి పోటీచేయలేని తెగేసి చెప్పారు. అవసరమైనప్పుడు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇది బీజేపీ అగ్రనేతలకు మింగుడుపడలేదు. అందుకే జగన్ ను దూరం చేశారు. దీనికి జగన్ కూడా మానసికంగా సిద్ధమయ్యారు. తనకు బీజేపీ అండ లేదని చెప్పడం ప్రారంభించారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఫస్ట్ జగన్ కే బీజేపీ నేతలు అవకాశమిచ్చారు. కానీ ఆయన నో చెప్పారు. కర్నాటకలో జేడీఎస్ తో కలిసి ముందుకెళ్లేందుకు బీజేపీ ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది. తమిళనాడులో ఇప్పటికే అన్నా డీఎంకే మిత్రపక్షంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి మాత్రం చంద్రబాబే కనిపిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ మద్దతు అవసరం లేదని అక్కడి బీజేపీ నాయకులు చెబుతున్నా ఎన్డీఏ బలోపేతంలో భాగంగా చంద్రబాబు