NTR Centenary Celebration : ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో జూ.ఎన్టీఆర్ ఎక్కడ? నారా, నందమూరి ఫ్యామిలీల్లో ఎవరెవరు వచ్చారు?

దాదాపు నందమూరి కుటుంబంలో వంద మంది వరకూ సభ్యులు ఉండగా.. కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అటు కుమారులు, ఇటు కుమార్తెలు, వారి వారసులు ఉన్నారు.

Written By: Dharma, Updated On : April 30, 2023 10:48 am
Follow us on

NTR Centenary Celebration : ఎన్టీఆర్ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి దక్షణాది సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. అంగరంగ వైభవంగా వేడుకలు జరిపారు. అయితే నందమూరి వారసులు కనిపించకపోడంతో స్పష్టమైన లోటు కనిపిస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కనిపించలేదు. దీంతో అభిమానులు హర్టవుతున్నారు. కార్యక్రమానికి  టీడీపీ నాయకులు, పలువురు ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. కార్యక్రమాన్ని బాలక్రిష్ణ అంతా తానై వ్యవహరించారు. మొత్తం నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు. బాలయ్య తర్వాత ఆ స్థాయిలో తాతగారి వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది తారక్. అలాంటి తారక్ , కళ్యాణ్ రామ్ బ్రదర్స్ శతజయంతి ఉత్సవాల్లో లేకపోవడం ఏదో వెలితిగా ఉందని నెటిజన్లు, అభిమానులు అంటున్నారు.

ఉద్దేశపూర్వకంగానే..
అయితే తొలుత వేడుకల ఆహ్వాన జాబితాలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ ల పేర్లు కనిపించాయి. తరువాత తీసివేశారన్న టాక్ నడుస్తోంది. అయితే అది ఉద్దేశపూర్వకంగా తీసేశారా? అన్న ప్రచారం జరుగుతోంది. జూనియర్ అభిమానులు తెగ బాధపడుతున్నారు. తమ హీరోకు మరోసారి అవమానం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతగానో అభిమానించే నటుడు ఎప్పటికీ తమ గుండెల్లో ఉంటారని, ఆయనకు ఇలాంటి ఆహ్వానాలు అక్కర్లేదని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంగా ఉంచినంత మాత్రాన తాము నిరాశకు గురి కావాల్సిన పని లేదని అన్నారు. తాము ఎప్పటికీ నందమూరి కుటుంబ అభిమానులమేనని, ఎవరికి వారు తమ ప్రాంతాల్లో సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించడానికి డిసైడయ్యారు.

కొద్దిమందే హాజరు..
దాదాపు నందమూరి కుటుంబంలో వంద మంది వరకూ సభ్యులు ఉండగా.. కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అటు కుమారులు, ఇటు కుమార్తెలు, వారి వారసులు ఉన్నారు. కానీ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుమారులు రామకృష్ణ, మోహన్‌కృష్ణ, కుమార్తె గారపాటి లోకేశ్వరి మాత్రమే  హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, చంద్రబాబు భార్య లోకేశ్వరి అస్సలు కనిపించలేదు. ఎన్టీఆర్ కార్యక్రమం అయినప్పుడు..ఆయన కుటుంబసభ్యులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే తారక్, కళ్యాణ్ రామ్ లకి ఇన్విటేషన్ అందకపోవడం విషయంలో ఫ్యాన్స్ మరోలా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని టిడిపి శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి. మే 20న హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఒక ఈవెంట్ జరగనుందట. ఈ విషయాన్ని బాలయ్యే తెలిపినట్లు తెలుస్తోంది. ఆ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజయరయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

హరికృష్ణ ఉండి ఉంటే..
అయితే జయంతి వేడుకల నిర్వహణలో బాలక్రిష్ణ ఆశించిన రీతిలో పనిచేయలేదు. కుటుంబసభ్యులను కోఆర్డీనేట్ చేయలేకపోయారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో నందమూరి హరికృష్ణ గురించి కూడా చర్చ జరుగుతోంది. హరికృష్ణ ఈ సమయంలో ఉండి ఉంటే ఇంకా ఆ సందడి ఎక్కువగా ఉండేది. ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన ఏకం చేసి ఉంటారని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికైనా కళ్యాణ్ రామ్, తారక్ సహా నందమూరి ఫ్యామిలీ మొత్తానికి ఆహ్వానం పంపి శతజయంతి వేడుకల్లో పాల్గొనేలా చేయాలని నందమూరి ఫ్యాన్స్ రిక్వస్ట్ చేస్తున్నారు.