Jagan controversy: వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రజల్లోకి వచ్చేందుకు నిర్ణయించారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తున్నారు కూడా. నిన్ననే విజయవాడలో ఇల్లు కూల్చివేత బాధితులను పరామర్శించారు. రేపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. అలా సేకరించిన సంతకాలను ఏపీ గవర్నర్కు నివేదించనున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రజా ఉద్యమాల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు అని అర్థం అవుతోంది. కానీ ఆయనకు మునుపటి మాదిరిగా స్వేచ్ఛ ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఐదేళ్లు పాలించారు. ప్రజలకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. అందులో కొన్ని హామీలను మాత్రమే తీర్చగలిగారు. మిగతా వాటి విషయంలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. ప్రధానంగా అగ్రిగోల్డ్ సమస్య.
వెంటాడుతున్న అగ్రిగోల్డ్..
2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపునకు ప్రధాన కారణం అగ్రిగోల్డ్( agri gold) బాధితులు. అప్పట్లో లక్షలాది మంది బాధితులు ఉండేవారు. పెద్ద ఎత్తున డిపాజిట్లు కట్టారు. కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం చేతులెత్తేసింది. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిపాటి మొత్తాన్ని బాధితులకు అందించి ఐదేళ్లపాటు కాలం గడిపేశారు. పైగా అదే అగ్రిగోల్డ్ భూములను వైసీపీ నేతలు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో మైనస్ అవుతోంది. విజయవాడ తో పాటు పరిసర ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తే ఇదే ప్రాధాన్య అంశంగా మారుతోంది.
విజయవాడ పర్యటనలో వింత ఘటన..
నిన్ననే జగన్మోహన్ రెడ్డి విజయవాడలో( Vijayawada) పర్యటించారు. ఇల్లు కూల్చివేతకు సంబంధించి బాధితులను పరామర్శించారు. ఆ సమయంలో ఓ మహిళ జగన్మోహన్ రెడ్డి వద్దకు వినతిపత్రంతో వచ్చింది. ఇల్లు కూల్చివేత బాధితురాలు అని భావించి జగన్మోహన్ రెడ్డి ఆమె గోడును తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే అగ్రిగోల్డ్ బాధితురాలు అని చెప్పడంతో తరువాత చూద్దాంలే అంటూ అక్కడ నుంచి పంపించేశారు. టాపిక్ డైవర్ట్ అవుతుందని చెప్పి ఆమెను పంపించడం విశేషం. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గతంలో ప్రతిపక్షాల విషయంలో ఇలాంటి మైండ్ గేమ్ లే ఆడాయి. అప్పట్లో నేతలు ప్రజాక్షేత్రంలోకి వస్తే ఏవేవో నిలదీత లకు ప్లాన్ చేసేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ప్రజలు గతాన్ని తవ్వే అవకాశం ఉంది. అప్పుడు టాపిక్ డైవర్ట్ అంటే కుదిరే పని కాదు. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన తమ విషయంలో ఆడిన మైండ్ గేమ్ ను ప్రతిపక్షాలు సైతం ప్రయోగిస్తాయి. అందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండాల్సిందే.