AP Weather: ఏపీలో( Andhra Pradesh) వాతావరణం లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు వర్షాలు దంచి కొట్టగా.. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. ఆపై ఉక్క పోత అధికంగా ఉంది. పరిస్థితి ఎండాకాలం గా మారింది. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఒకటి ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని స్పష్టం చేసింది. ఈ నెలాఖరు వరకు ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడనుందని స్పష్టం చేసింది.
* రెండు రోజులుగా గ్యాప్..
గత రెండు రోజులుగా వర్షాలు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా.. ఏపీ, ఒడిస్సా, తెలంగాణ వైపు కదిలే అవకాశం ఉంది. దీనికి కారణంగా ఈ నెల ఆఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత కొనసాగుతోంది.
* కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల వంటి ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
* మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
* కొన్ని ప్రాంతాల్లో అయితే విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగుతుండగా.. సాయంత్రానికి భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి.
* ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా రాజస్థాన్, గుజరాత్ వైపు కదులుతూ వాయుగుండం గా బలపడే అవకాశం ఉంది.